తండ్రితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రకాష్ రాజ్తండ్రితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రకాష్ రాజ్
తండ్రితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రకాష్ రాజ్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం దేశ ప్రజలందరూ పాటిస్తున్న 21 రోజుల లాక్ డౌన్ సమయంలో నిత్యం సినిమాలు షూటింగ్ అంటూ బిజీగా గడిపే సినిమా తారలు అందరూ తమ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతున్నారు. తమకు నచ్చిన వాటిని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను ప్రజలను కూడా ఇంటి వద్ద సురక్షితంగా ఉండమని బయట తిరగవద్దు.! అని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో నైతిక మరియు సామాజిక బాధ్యతతో ముందు అందరికంటే ముందు స్పందించి తన సిబ్బందికి మూడు నెలల జీతం అడ్వాన్స్ గా ఇచ్చేసారు  ప్రకాష్ రాజ్. తన దగ్గర పనిచేసే ఇతర సిబ్బందికి కూడా నిత్యావసర సరుకులతో పాటు కొంత మందికి వసతి సదుపాయం కూడా కల్పించాడు. ఇక గతంలో తన కొడుకుతో పాటు జాతీయగీతం పాడుతూ వీడియో విడుదల చేసిన ప్రకాష్ ప్రస్తుతం తన కొడుకు తో ఆడుకుంటూ ఉన్న ఒక వీడియో ని షేర్ చేశాడు. అందులో భాగంగా ప్రకాష్ రాజ్ పడుకొని ఉంటే ప్రకాష్ రాజ్ కొడుకు తనవి పైకి ఎక్కి తన చిన్న చిన్న కాళ్లతో తొక్కుతూ ఉండటం గమనించవచ్చు. మనందరం కూడా చిన్నతనంలో ఇలాగే మన నాన్నతో మనకు ఆడుకుంటూ, సేవచేస్తూ మనకు కావలసిన కోరికలు అడిగే వాళ్ళం.

 “నిజంగా మన తల్లిదండ్రులతో గడిపే సమయం అంత గొప్ప సమయం ఎక్కడ ఉండదు.” అంటూ భావోద్వేగపరమైన పోస్ట్ షేర్ చేశారు ప్రకాష్ రాజ్.