బీజేపీ మత రాజకీయాలపై మండిపడిన ప్రకాష్ రాజ్


Prakash raj shares BJP Candidate wife begging for votesసినీ నటుడు ప్రకాష్ రాజ్ భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలపై మండిపడుతున్నాడు . ఇప్పటికే పలుమార్లు బీజేపీ వైఖరి పై మండిపడిన ప్రకాష్ రాజ్ ప్రధాని మోడీ అంటే చాలు ఒంటికాలు పై లేస్తున్నాడు . స్వతహాగా కన్నడ వాసి అయిన ప్రకాష్ రాజ్ గతకొంతకాలంగా బీజేపీ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు సమస్యలపై స్పందిస్తూ బీజేపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు .

తాజాగా కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నందున బీజేపీ తరుపున మంగళూరు లో ఓ అభ్యర్థి భార్య ప్రచారం చేసింది అయితే ఆ ప్రచారం కాస్త మతపరంగా, కులపరంగా సాగడంతో దాన్ని ఎవరో వీడియో తీశారు , ఆ వీడియో కాస్త ప్రకాష్ రాజ్ కంట పడటంతో బీజేపీ మతపరమైన ప్రచారం పై ఆగ్రహం వ్యక్తం చేసాడు . భారతీయ జనతా పార్టీ వ్యవహారం పట్ల సిగ్గుపడుతున్నానని , ఇదే మీ వైఖరా ? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు ప్రకాష్ రాజ్ . కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా తెరవెనుక పెద్ద ప్రయత్నాలే చేస్తున్నాడు ప్రకాష్ రాజ్ .