తనయుడితో కలిసి జాతీయ గీతం పాడుతున్న ప్రకాష్ రాజ్


Prakash Raj sings the national anthem with his son
Prakash Raj sings the national anthem with his son

ప్రకాష్ రాజ్ గారు ఒక మంచి నటుడు,నిర్మాత,దర్శకుడు మాత్రమే కాదు అంతకు మించి ఒక తత్వవేత్త.. సామాజిక చైతన్యం ఉన్నమనిషి. చుట్టూ పక్కల సమాజంలో జరిగే ఎన్నో విషయాలను తనదైన శైలిలో నిలదీసి అందులో మామూలు ప్రజలకు కనబడని ఎన్నో కోణాలను కూడా బయటకు తీసి ప్రశ్నించే  వ్యక్తి. కొంత మంది ఆయనను హిందుత్వ విధానంపై కావాలని వివాదం సృష్టిస్తున్నవ్యక్తిగా ప్రచారం చేస్తున్నారు. అందులో కొంత నిజం ఉన్నప్పటికీ…  కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం కుల,మత,జాతులకు అతీతంగా ప్రకాష్ రాజ్ స్పందించే తీరు, ప్రవర్తించే పద్ధతి నిజంగా ప్రజలకు ఆదర్శనీయం అనుసరణీయం.

ఇతర మనుషుల లాగా కేవలం మొక్కుబడిగా విరాళం ప్రకటించిన ఊరుకోకుండా ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో తన స్టాఫ్ కి మూడు నెలలపాటు ముందే జీతభత్యాలు చెల్లించి; అదేవిధంగా తను పనిచేస్తున్న మూడు సినిమాలకు సంబంధించి ఉన్న రోజువారీ కార్మికులకు కూడా సగం డబ్బులు ఇచ్చి… ఒక అడుగు ముందుకేసి సమాజాన్ని చైతన్యవంతం చేసిన వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు.

అదే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ అయిన నేపథ్యంలో వేరే దూర ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడే నేపథ్యంలో తన దగ్గర ఉన్న దాదాపు 11 మంది సిబ్బందికి తన వద్ద ఆశ్రయం కల్పించిన వ్యక్తి ప్రకాష్ రాజ్. ఇక ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో తన తనయుడు తో కలిసి జాతీయ గీతాన్ని పాడుతున్నారు ప్రకాష్ రాజ్.

“వైరస్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకొక చోటికి వెళ్లలేదు. ప్రజలే దానిని మోసుకొని తీసుకెళ్తారు. కాబట్టి బాధ్యతతో ప్రవర్తించండి. మరియు మీ ఇంటి వద్దనే సురక్షితంగా ఉండండి.” అని కరోనా వైరస్ పై ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న అన్ని వర్గాల సంబంధించిన అధికారులకు మీరు చేసే గొప్ప సహాయం అదే..! వారి గురించి కూడా ఆలోచించండి.” అని ప్రకాష్ రాజ్ సందేశం విడుదల చేశారు.

ఇక ఈ వీడియోకు సంబంధించి కూడా కొంతమంది వివాదాస్పదమైన కామెంట్లు పెడుతున్నారు. ప్రకాష్ రాజ్ కూర్చుని జాతీయగీతం పాడారనీ.. ఆయన నిలబడి జాతీయగీతం పాడాలని జాతీయ గీతానికి ప్రకాష్ సరైన గౌరవం ఇవ్వడం లేదని.. కూడా కొంతమంది తమ కామెంట్ల ద్వారా లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారు. ఒక మనిషి చేసే పనిలో మంచిని వదిలేసి వివాదాన్ని వెతికే సమాజంలోని కొంతమంది వ్యక్తుల మనసులు ఈ ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ లో అయినా బాగుపడాలని కోరుకుందాం.