మ‌రో అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నా!


మ‌రో అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నా!
మ‌రో అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నా!

ప్ర‌ణీత‌.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాతో పాటు వార్తా మాధ్య‌మాల్లో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరిది. తెలుగు ఇండ‌స్ట్రీ హిట్ `పోకిరి` ఆధారంగా క‌న్న‌డ‌లో రీమేక్ అయిన `పోర్కి` చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించిన ప్ర‌ణీత `ఏం పిల్లో ఏం పిల్ల‌డో` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. `అత్తారింటికి దారేది` చిత్రంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో తొలిసారి క‌లిసి న‌టించింది. ఈ సినిమా త‌రువాత ఆమె కెరీర్ ఊపందుకుంటుంద‌ని అంతా భావించారు.

కానీ అది జ‌ర‌గ‌లేదు. త‌మిళ, క‌న్న‌డ చిత్రాల్లో న‌టిస్తూ వ‌స్తోంది.  తాజాగా క‌రోనా విజృంభిస్తున్న వేళ అంద‌రికీ భిన్నంగా ప్ర‌ణీత చేస్తున్న సాయం ప‌లువురిని ఆలోచింప‌జేస్తోంది. వంట‌లు చేయించి ఆక‌లితో బాధ‌ప‌డుతున్న పేద‌వారి ఆక‌లి తీరుస్తున్నారు. ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన ప్ర‌ణీత ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. ‌

`అలత్తారింటికి దారేది` వంటి క్రేజీ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత ఆ క్రేజ్‌ని ఎందుకు స‌ద్వినియోగం చేసుకోలేద‌ని ప్ర‌శ్నిస్తే అందులో ఎలాంటి నిజం లేద‌ని కొట్టిపారేసింది. త‌మిళ‌, క‌న్న‌డ ఇండ‌స్ట్రీల నుంచి చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని, అందులో నాకు న‌చ్చిన‌వి అంగీక‌రించాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే తెలుగులో మాత్రం నాకు న‌చ్చిన క‌థ‌లు నా ద‌గ్గ‌రికి రాలేద‌ని, అందుకే తెలుగులో న‌టించ‌లేద‌ని వెల్ల‌డించింది. ఇక అత్తారికి దారేది` స‌మ‌యంలో ప‌వ‌న్‌తో క‌లిసి న‌టించ‌డం ఎలా అనిపించింద‌ని అడిగితే .. ప‌వ‌న్‌తో క‌లిసి న‌టించినా ఆయ‌న‌తో ఎక్కువ స‌మ‌యం స్పెండ్ చేయ‌లేక‌పోయాన‌ని, ఆయ‌న‌తో క‌లిసి న‌టించే మ‌రో అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాన‌ని వెల్ల‌డించ‌డం విశేషం.