ప్రభాస్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఇంకా ఉందా?

ప్రభాస్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఇంకా ఉందా?
ప్రభాస్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఇంకా ఉందా?

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. డిసెంబర్ ఎండ్ లోపు రాధే శ్యామ్ షూటింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్నది ప్రభాస్ కండిషన్. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. రాధే శ్యామ్ పూర్తైన వెంటనే ప్రభాస్ ఆది పురుష్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ను రికార్డు సమయంలో పూర్తి చేసి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను మొదలుపెట్టాలన్నది ప్లాన్. దీంతో ప్రభాస్ 2023 వరకూ ఫుల్ బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా ఉంటుందని అన్నారు. మరి ప్రభాస్ రానున్న మూడేళ్లు బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తాడన్నది ప్రశ్నర్ధకంగా మారింది. ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ పూర్తి చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. డిసెంబర్ నెలాఖరుకి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.