ఎన్టీఆర్, మహేష్ లతో చెలగాటమాడుతున్న కేజిఎఫ్ దర్శకుడు


ఎన్టీఆర్, మహేష్ లతో చెలగాటమాడుతున్న కేజిఎఫ్ దర్శకుడు
ఎన్టీఆర్, మహేష్ లతో చెలగాటమాడుతున్న కేజిఎఫ్ దర్శకుడు

ప్రశాంత్ నీల్ అంటే ఎవరు అనే సందేహం వచ్చినా కెజిఎఫ్ దర్శకుడు అనగానే మంచి డైరెక్టర్ అనే భావన సాధారణ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఒక్క సినిమాతో భాషతో సంబంధం లేకుండా అందరి అభిమానాన్ని చూరగొన్నాడు ప్రశాంత్ నీల్. కెజిఎఫ్ లాంటి అద్భుతమైన సినిమాను అందించిన ప్రశాంత్ మీద టాలీవుడ్ కన్ను త్వరగానే పడింది. కెజిఎఫ్ విడుదలైన కొన్ని రోజులకే ఇక్కడి బడా స్టార్స్ నుండి ప్రశాంత్ కు ఎంక్వయిరీలు మొదలయ్యాయి. మాకు సూట్ అయ్యే కథ ఏదైనా ఉందా వెంటనే డేట్స్ ఇవ్వడానికి సిద్ధం అంటూ రాయబారాలు కూడా నడిపారు. అలా ప్రశాంత్ గురించి ఆరా తీసిన మన హీరోల్లో ఫస్ట్ ఎన్టీఆర్ అయితే తర్వాత మహేష్. గత కొన్ని నెలల్లో ఈ ఇద్దరినీ ప్రశాంత్ హైదరాబాద్ వచ్చి మరీ కలిసాడు. దాంతో మా హీరోతో కెజిఎఫ్ దర్శకుడు సినిమా అంటే లేదు మా హీరోతో అంటూ ఎవరికి వారీ ఎగ్జైట్ అవుతున్నారు.

ప్రశాంత్ నీల్ ఇప్పుడు కెజిఎఫ్ 2 షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మార్చ్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరిలో ఒకరితో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందన్నది మాత్రం కన్ఫర్మ్. అయితే అది ఎన్టీఆర్, మహేష్ లలో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే దర్శకుడ్ని ఇదే విషయం ఆయా హీరోలు అడిగితే ఇద్దరితోనూ మీతోనే సినిమా అని చెప్తున్నాడట. ఈ విషయంపై ప్రశాంత్ ఎప్పటికీ తేల్చట్లేదు కాబట్టి ఎన్టీఆర్ ఇక త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం నడుస్తున్న అల వైకుంఠపురములో కమిట్మెంట్ పూర్తవ్వగానే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై కూర్చుంటాడని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ నుండి జులైకి కానీ ఫ్రీ అవ్వడు. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కథ సిద్ధం చేసుకోవడానికి ఆరు నెలల సమయం ఉందన్నమాట.

మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరు కంప్లీట్ అవ్వగానే మరో సినిమా ఒప్పుకోకుండా నాలుగైదు నెలలు బ్రేక్ తీసుకుంటాడని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ విషయాన్ని నమ్రత ధృవీకరించింది కూడా. ఈ గ్యాప్ ప్రశాంత్ నీల్ కోసమేనని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ నుండి ఫ్రీ అయ్యి మరో సినిమా మొదలుపెట్టడానికి కనీసం మే అవుతుంది. అప్పటిదాకా మహేష్ ఈ దర్శకుడి కోసం వెయిట్ చేస్తాడన్నమాట. చూద్దాం మరి ప్రశాంత్ నీల్ ఆలోచన ఏ విధంగా ఉందో.