వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌శాంత్ వ‌ర్మ ‘జాంబీ రెడ్డి!

prashant varma next film title Zobie reddy
prashant varma next film title Zobie reddy

అ, క‌ల్కి వంటి విభిన్న‌మైన చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్ర‌శాంత్ వ‌ర్మ. ఆయ‌న య‌దార్థ సంఘ‌ట‌న‌ల్ని ఆధారం చేసుకుని ఓ వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌శాంత్ వ‌ర్మ తాజాగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్‌ని వ‌దిలిన ప్ర‌శాంత్ వ‌ర్మ దీనికి సంబంధించిన  టైటిల్ లొగో టీజ‌ర్‌ని శ‌నివారం ప్ర‌క‌టించారు.

జాంబీ జోన‌ర్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి `జాంబీ రెడ్డి` అనే టైటిల్‌ని క‌న్ఫ‌మ్ చేశారు. శ్మ‌శానం, అందులోంచి భూమిని చీలుస్తూ చేయి పైకి లేవ‌డం… టైటిల్‌ని రాక్ష‌స చేయిలో టైటిల్ బందీ కావ‌డం.. గుడ్ల గూబ‌.. ఆకాశంలో చంద్రుడు ఎర్ర‌బారిపోవ‌డం కొంత భ‌యాన‌కంగ‌నే క‌నిపిస్తోంది. వైర‌స్‌కీ.. జాబీ రెడ్డీకి వున్న సంబంధం ఏంటి? అన్న‌దే ఇక్క‌డ అస‌లు ట్విస్ట్‌.. వైర‌స్ వ‌ల్ల మ‌నుషులు జాంబీలుగా మార‌తారా, లేక వ్య‌వ‌స్థ‌పై ప‌గ‌తో జాంబీ రెడ్డి ంద‌రినీ జాంబీలుగా మారుస్తాడా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ `తెలుగులో తొలి జాంబీ మూవీ ఇది. ప్ర‌శాంత్ వ‌ర్మ యునిక్ మేకింగ్ స్టైల్‌పై త‌న‌కు అపార‌మైన న‌మ్మ‌కం వుంది. హై క్వాలిటీతో నిజ‌జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా మంచి గుర్తింపును తెచ్చుకోవాల‌నే సంక‌ల్పంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం` అని తెలిపారు. హై కాన్సెప్ట్ ఫిల్మ్ జాంబిరెడ్డి. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. కాన్సెప్ట్‌ని ఊహించిన వారికి బ‌హుమ‌తులు అంద‌జేస్తాం` అని ప్ర‌శాంత్ వ‌ర్మ అన్నారు.