ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఆ ద‌ర్శ‌కుడితో..?


ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఆ ద‌ర్శ‌కుడితో..?
ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఆ ద‌ర్శ‌కుడితో..?

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`(రుద్రం ర‌ణం రుథిరం). ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ మూడొంతులు పూర్త‌యింది. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రంభీంగా న‌టిస్తున్నారు. ఓ ఫాంట‌సీ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌తో పాటు హాలీవుడ్ న‌టులు న‌టిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

అయితే ఈ సినిమా త‌రువాత కూడా మ‌రో చిత్రానికి ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించ‌నుందట‌. ఈ చిత్రానికి `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తాజా న్యూస్‌.  త్రివిక్ర‌మ్ చిత్రాన్ని అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేసి ప్ర‌శాంత్ నీల్ చిత్రాన్ని ఎన్టీఆర్ సెట్స్‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.