`స‌లార్‌` టైటిల్‌కు అర్థం చెప్పిన ప్ర‌శాంత్ నీల్‌!`స‌లార్‌` టైటిల్‌కు అర్థం చెప్పిన ప్ర‌శాంత్ నీల్‌!
`స‌లార్‌` టైటిల్‌కు అర్థం చెప్పిన ప్ర‌శాంత్ నీల్‌!

`బాహుబ‌లి` సినిమాతో ప్ర‌భాస్ జాత‌క‌మే మారిపోయింది. ఆయ‌న్ని ఈ మూవీ పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. దీంతో ఈ మూవీ త‌రువాత అంతా ఆ స్థాయి చిత్రాలతో సంప్ర‌దిస్తున్నారు. తాజాగా ప్ర‌భాస్ `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ దర్శ‌‌క‌త్వంలో `స‌లార్‌` పేరుతో పాన్ ఇండియా చిత్రాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీని `కేజీఎఫ్` మేక‌ర్స్  హోంబ‌లే ఫిల్మ్స్ అధినేత విజ‌య్ కిర‌గందుర్ నిర్మిస్తున్నారు. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసిన ఈ మూవీ టైటిల్‌పై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్  ఈ మూవీ టైటిల్ గురించి, ప్ర‌భాస్‌ని ఇందులో హీరోగా ఎంచుకోవ‌డం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. టైటిల్ అర్థం ఏంటో కూడా వివ‌రించారు. ఉగ్రం, కేజీఎఫ్ చిత్రాల‌తో క‌న్న‌డ‌లో మంచి పేరు తెచ్చుకున్నాను. ఇక్క‌డ వున్న హీరోల‌ను కాకుండా తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌భాస్‌ని హీరోగా తీసుకోవ‌డం గురించి చాలా మంది అడుగుతున్నారు. నేను రాసుకున్న `స‌లార్` క‌థకు ప్ర‌భాస్ స‌రిగ్గా స‌రిపోతాడ‌నిపించింది. అందుకే ఆయ‌న‌తో  సినిమా చేస్తున్నాను. మిగ‌తా విష‌యాలు సినిమా విడుద‌ల‌య్యాక మాట్లాడ‌తాను` అన్నారు.

`స‌లార్‌` టైటిల్ గురించి మాట్లాడుతూ ` `స‌లార్‌` టైటిల్‌కు ఎంతో మంది ఎన్నో అర్థాలు చెబుతున్నారు. ఇది ఒక సామాన్య‌మైన ప‌దం. ఉర్తూ భాష ప్ర‌కారం `స‌లార్‌` అంటే స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌కుడు అని అర్థం. రాజుకి కుడి భుజంగా వుంటూ ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ కోసం పాటుప‌డే వ్య‌క్తి అని కూడా చెప్పొచ్చు. ఓ వైలెంట్ పాత్ర‌ను మీ ముందుకు తీసుకురానున్నాను. క‌థ‌కు అద్దంప‌ట్టేలా ఫ‌స్ట్ లుక్‌ని తీర్చిదిద్దాం. ప్ర‌భాస్ లుక్ చూసి ఆయ‌న ఆర్మీలో ఉండే వ్య‌క్తి అని అంద‌రూ అనుకుంటార‌నే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను టైటిల్‌తో విడుద‌ల చేశాం` అని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ స్ప‌ష్టం చేశారు.