ప్ర‌శాంత్‌నీల్‌‌తో తెలుగు నిర్మాత‌ల బిగ్‌డీల్‌!


ప్ర‌శాంత్‌నీల్‌‌తో తెలుగు నిర్మాత‌ల బిగ్‌డీల్‌!
ప్ర‌శాంత్‌నీల్‌‌తో తెలుగు నిర్మాత‌ల బిగ్‌డీల్‌!

క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో కేవ‌లం రెండ‌వ సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. ఆయ‌న తెర‌కెక్కించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. క‌న్న‌డ‌లో కంటే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌నీల్‌కి తెలుగులోనే క్రేజ్ భారీగా ఏర్ప‌డింది. దీంతో అత‌ని డైరెక్ష‌న్‌లో సినిమా చేయాల‌ని తెలుగు ప్రొడ్యూస‌ర్‌లు క్యూ క‌ట్ట‌డం మొద‌లైంది.

అందులో ఇద్ద‌రు క్రేజీ ప్రొడ్యూస‌ర్‌ల‌కు ప్ర‌శాంత్ నీల్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు. అందులో ఒక‌టి మైత్రీ మూవీమేక‌ర్స్‌, మ‌రొక‌టి డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించే చిత్రాన్ని యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో చేయ‌బోతున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ లో హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకా తెలియ‌లేదు. ప్ర‌శాంత్ నీల్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఈ రెండు సంస్థ‌లు అఫీషియ‌ల్‌గా ప్ర‌శాంత్ నీల్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెల‌ప‌డంతో క్లారిటీ వ‌చ్చేసింది.

ప్ర‌స్తుతం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`కు సీక్వెల్‌గా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`ని తెర‌కెక్కిస్తున్నారు. 20 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం షూటింగ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` కూడా ప్రారంభం కాబోతోంది.