`కేజీఎఫ్` డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ ఫిల్మ్ కన్ఫ‌ర్మేనా?


`కేజీఎఫ్` డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ ఫిల్మ్ కన్ఫ‌ర్మేనా?
`కేజీఎఫ్` డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ ఫిల్మ్ కన్ఫ‌ర్మేనా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ప్ర‌స్తుతం `రాధేశ్యామ్‌` మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. రాధాకృష్ణ‌కుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇట‌లీలో జ‌రుగుతోంది. ఇటీవ‌లే చిత్ర బృందం కీల‌క షెడ్యూల్ కోసం టీమ్ మొత్తం ఇటీలీ వెళ్లింది. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు ప్ర‌భాస్ మ‌రో రెండు చిత్రాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ తో పాటు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ త్రీ‌డీలో తెర‌కెక్కించ‌నున్న `ఆదిపురుష్‌` చిత్రంతో న‌టించ‌నున్నారు. ఈ రెండు చిత్రాల‌తో పాటు `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో పాన్ ఇండాయా స్థాయికి మించి ఓ భారీ చిత్రానికి ఓకే చెప్పిన‌ట్టు వార్త‌లు గ‌త కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఈ నెల 23న రాబోతోంద‌ని తెలుస్తోంది.

ఈ నెల 23న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న రాబోతోందిని తెలుస్తోంది. బ‌హుభాషా చిత్రంగా తెర‌పైకిరానున్న ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత నిర్మిస్తారా?  లేక క‌న్న‌డ ప్రొడ్యూస‌ర్ ప్రొడ్యూస్ చేస్తాడా అన్న‌ది మాత్రం ఇంకా తెలియ‌రాలేదు.