ప్ర‌శాంత్‌వ‌ర్మ క‌రోనా సినిమా!


ప్ర‌శాంత్‌వ‌ర్మ క‌రోనా సినిమా!
ప్ర‌శాంత్‌వ‌ర్మ క‌రోనా సినిమా!

హీరో నేచుర‌ల్ స్టార్ నాని తొలిసారి నిర్మాత‌గా మారి నిర్మించిన చిత్రం `అ!`.  మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఈ సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న ఈ యువ టాలెంటెడ్ ఆ త‌రువాత చేసిన `క‌ల్కీ` మేకింగ్ ప‌రంగా, టేకింగ్ ప‌రంగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. వ‌రుస‌గా రెండు విభిన్న‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ త‌దుప‌రి చిత్రం ఎలా వుండ‌బోతోంది?

ఏ నేప‌థ్యంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌శాంత్ వ‌ర్మ క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సినిమా చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే దానికి గురించి ద‌ర్శ‌కుడి నుంచి ఇంత వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ లేదు.

తాజ‌గా త‌న త‌దుప‌రి చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. వ‌ర‌ల్డ్ ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో త‌న త‌దుప‌ర చిత్రాన్ని చేస్తున్న‌ట్టు వెల్ల‌డించాడు. ఈ చిత్రానికి  corona vaccine loading అంటూ ఓ సిరంజీ సింబ‌ల్‌తో ఓ పోస్ట‌ర్‌ని వ‌దిలి త‌న త‌దుప‌రి సినిమా ని అనౌన్స్ చేశాడు.  శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ ఏయ‌బోతున్న‌ట్టు హింట్ ఇచ్చాడు.