క‌రోనా ..జ‌స్ట్ బిగినింగ్‌.. ప్రీలుక్!


క‌రోనా ..జ‌స్ట్ బిగినింగ్‌.. ప్రీలుక్!
క‌రోనా ..జ‌స్ట్ బిగినింగ్‌.. ప్రీలుక్!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. దీని దెబ్బ‌కువ‌ర‌ల్డ్ మొత్తం అల్లాడుతోంది. ఎంత కంట్రోల్ చేయాల‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అంత కంత‌కు పెరిగిపోతోంది. వేల‌ల్లో వ్యాపిస్తోంది. చేసేది లేక ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు దీన్ని ఎదుర్కొనే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.  ఇదిలా వుంటే దీని నేప‌థ్యంలో యంగ్ టాలెంట్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ సినిమాకు శ్రీ‌కారం చుట్టాడు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్‌ని రిలీజ్ చేయ‌డం ఆసక్తిక‌రంగా మారింది.

ప్రీలుక్ పోస్ట‌ర్‌తో పాటు మోష‌న్ టీజ‌ర్‌ని కూడా రిలీజ్ చేశారు. టీజ‌ర్‌లో కొండారెడ్డి బురుజు, తెలుగు త‌ల్లి విగ్ర‌హం, ట్రిఫిక్ సిగ్న‌ల్‌..దాని ముందు భ‌యంక‌ర‌మైన ఆకారం ర‌క్తం చిమ్ముతూ భ‌యాన‌కంగా అరుస్తున్న తీరు భ‌యంక‌రంగా వుంది. ట్రాఫిక్ సిగ్న‌ల్‌పై స్టే హోమ్ .. స్టే సేఫ్ అని క‌నిపిస్తుండ‌గా, ట్రాఫిక్ సిగ్న‌ల్ చుట్టూ రోడ్డుపై శ‌వాలు క‌నిపిస్తున్నాయి.  ఫ‌స్ట్ లుక్‌లోనే త‌న సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేసిన ప్ర‌శాంత్ వ‌ర్మ ఎండింగ్‌లో క‌రోనా జ‌స్ట్ ద బిగినింగ్.. అంటూ ముగించాడు. ట్రూ ఈ వెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ వ‌స్తున్న ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రాన్ని క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో ఎవ‌రు న‌టిస్తున్నారు? వ‌ంటి వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.