తాత కోసం మనువడు ఏమి చేసాడో అన్నట్టుగా ఉంది కథ.


తాత కోసం మనువడు ఏమి చేసాడో అన్నట్టుగా ఉంది కథ.
తాత కోసం మనువడు ఏమి చేసాడో అన్నట్టుగా ఉంది కథ.

నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో నటుడు ‘సాయి ధరమ్ తేజ్’ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా ‘ప్రతో రోజు పండగే’ లోని (ఫస్ట్ గింప్స్) అనగా క్లుప్తంగా సినిమా గురించి వివరించే ఒకే వీడియోని రిలీజ్ చేసారు. మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుంది.

సినిమా గురించి మాట్లాడుకుంటే విదేశాలలో సెటిల్ అయిపోయిన తన మనవడు తాత గురించి తెలుసుకొని పల్లెటూరికి వచ్చి తాతని కలుసుకొని తన యవ్వనం లో మిస్ అయిన మధురానుభూతుల్ని తాతకి గుర్తుచేసుకుంటూ సాగిపోయే కథ లాగా సినిమా ఉండబోతుంది అని వీడియో చూసిన ఎవ్వరికి అయిన ఇట్టే అర్ధం అయిపోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందిస్తున్నారు. వీడియో లో చూసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.

ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, సత్య రాజ్, వెన్నెల కిషోర్, హరి తేజ, మహేష్ ఆచంట మరియు హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ – రాశి ఖన్నాగారు జంటగా రెండవ సారి నటిస్తున్న సినిమాలో రాశి ఖన్నా ఈ సినిమాలో గ్లామర్ పరంగా రెచ్చిపోయారు అని సినిమా యూనిట్ వాళ్ళు అనుకుంటున్నారు. అయితే నిన్న వీడియో చూసిన కొంతమంది మాత్రం నిజంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. సంక్రాంతికి రావాల్సిన సినిమాలు చూసుకుంటే వాటిలో కంటే ఈ సినిమాలో కావాల్సినంత కథ వుంది అని అనుకుంటున్నారు.

అలా సంక్రాంతిని మిస్ అవుతూ డిసెంబర్ క్రిస్టమస్ కి రాబోతున్న సినిమా సాయి ధరమ్ తేజ్ కి అలాగే రాశి ఖన్నా కి నిజంగా హిట్ సినిమా దక్కాలి అని ఫ్యాన్స్ అందరూ వేడుకుంటున్నారు.