ప్రతిరోజూ పండగే 17 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్


ప్రతిరోజూ పండగే 17 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్
ప్రతిరోజూ పండగే 17 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్ర వసూళ్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం తొలివారంలోనే సూపర్ హిట్ స్టేటస్ సంపాదించింది. మొదటి రోజు యావరేజ్ రేటింగులతో మొదలైన ప్రతిరోజూ పండగే ప్రయాణం క్రమంగా పుంజుకుంది. తొలి వీకెండ్ ముగిసేనాటికే హిట్ అవ్వగలదన్న నమ్మకం కలిగించింది. వర్కింగ్ డేస్ లో కూడా ప్రతిరోజూ పండగే ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోవడంతో తొలివారంలోనే హిట్ అనిపించుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో ప్రతిరోజూ పండగే జోరు మాములుగా లేదు. ప్రస్తుతం మూడో వారంలో కూడా ప్రతిరోజూ పండగే మెప్పిస్తోంది. మొదటి వారంతో పోలిస్తే కలెక్షన్స్ తగ్గుముఖం పట్టినా కానీ మరో రెండు రోజులు ప్రతిరోజూ పండగే హవా ఉండనుంది. జనవరి 9న రజినీకాంత్ దర్బార్ తో మొదలయ్యే సంక్రాంతి సినిమాల హంగామా తేజ్ సినిమాదే బాక్స్ ఆఫీస్ వద్ద రాజ్యం.

ఈ చిత్ర 17 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ ఇలా ఉంది..

నైజాం :Rs 11.70 Cr

సీడెడ్ : Rs 3.71 Cr

గుంటూరు : Rs 1.80 Cr

వైజాగ్ : Rs 4.52 Cr

ఈస్ట్: Rs 1.94 Cr

వెస్ట్: Rs 1.47 Cr

నెల్లూరు: Rs 0.84 Cr

కృష్ణ: Rs 1.93Cr

ఆంధ్ర + తెలంగాణ : Rs 27.91 Cr Shares

రెస్ట్ ఆఫ్ ఇండియా: Rs 1.80 Cr

ఓవర్సీస్: Rs 2.58 Cr

వరల్డ్ వైడ్ : Rs 32.29 Cr Shares

ఇప్పటికే 32 కోట్లను దాటిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 35 కోట్ల మార్క్ ను క్రాస్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మేర బిజినెస్ చేసింది. అంటే ఇప్పటికే 14 కోట్లు లాభాలు వచ్చాయి. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, సత్యరాజ్ పాత్రలు మెయిన్ హైలైట్ గా నిలిచాయి.