ప్రతిరోజూ పండగే 18 డేస్ కలెక్షన్స్ డీటెయిల్స్

ప్రతిరోజూ పండగే 18 డేస్ కలెక్షన్స్ డీటెయిల్స్
ప్రతిరోజూ పండగే 18 డేస్ కలెక్షన్స్ డీటెయిల్స్

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ప్రతిరోజూ పండగే. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ రేటింగులతోనే మొదలైనా నెమ్మదిగా పుంజుకుని, హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా తోడవ్వడంతో తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. అయితే అనూహ్యంగా రెండో వారం కూడా ఈ చిత్రం హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. న్యూ ఇయర్ హాలిడే కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. ఇక మూడో వారంలో ఈ చిత్రం కొంచెం డౌన్ అయింది. రేపటి నుండి సంక్రాంతి సినిమాల సందడి షురూ కానుండడంతో ప్రతిరోజూ పండగే ఇక ఫుల్ రన్ కు చేరుకునే అవకాశాలున్నాయి.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే, ఎలా ఉంటే మన జీవితంలో ప్రతిరోజూ పండగలా ఉంటుందో వివరిస్తుంది. అలాగే పుట్టడమే కాదు, చనిపోవడం కూడా ఒక పండగ లాంటిదనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా రావు రమేష్ క్యారెక్టర్ సూపర్ గా పండడంతో ప్రతిరోజూ పండగేకు ప్రేక్షకుల ఆదరణ బాగా పెరిగింది.

18వ రోజు ప్రతిరోజూ పండగే దాదాపు 60 లక్షల షేర్ రాబట్టింది. దీంతో 18 రోజుల కలెక్షన్స్ 32.85 కోట్ల షేర్ కు చేరుకుంది. 18 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ కాబడ్డ ఈ చిత్రం ద్వారా డిస్ట్రిబ్యూటర్లు అందరూ భారీ లాభాలను గడించారు.

18 రోజుల ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ బ్రేక్ డౌన్ చూద్దాం.

నైజాం :Rs 11.86 Cr

సీడెడ్ : Rs 3.79 Cr

గుంటూరు : Rs 1.92 Cr

వైజాగ్ : Rs 4.55 Cr

ఈస్ట్: Rs 1.98 Cr

వెస్ట్: Rs 1.48 Cr

నెల్లూరు: Rs 0.87 Cr

కృష్ణ: Rs 2.01 Cr

ఆంధ్ర + తెలంగాణ : Rs 28.46 Cr Shares

రెస్ట్ ఆఫ్ ఇండియా: Rs 1.81 Cr

ఓవర్సీస్: Rs 2.58 Cr

వరల్డ్ వైడ్ : Rs 32.85 Cr Shares

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తవ్వగా రెండో షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది.