ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్: పండగ ముందుంది


ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్: పండగ ముందుంది
ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్: పండగ ముందుంది

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ప్రతిరోజూ పండగే నిన్న విడుదలై మంచి టాక్ ను తెచ్చుకున్న విషయం తెల్సిందే. మరీ సూపర్ హిట్ టాక్ కాకపోయినా నిన్న విడుదలైన నాలుగు సినిమాల్లో ప్రతిరోజూ పండగేకే బెటర్ టాక్ అండ్ రేటింగ్స్ వచ్చాయి. ఈ సినిమానే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయస్ అవ్వనుంది. తొలిరోజు మార్నింగ్ షో తో పోల్చితే ఫస్ట్ షో టైమ్ కి ప్రేక్షకుల స్పందన మెరుగవడంతో వీకెండ్ పూర్తయ్యేసరికి ప్రతిరోజూ పండగే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండనుంది. మొదటి రోజుతో పోల్చితే ఈరోజు, రేపు కలెక్షన్స్ ఇంకా మెరుగవనున్నాయి. రానున్నవి క్రిస్మస్ సెలవులు కావడంతో ఈ చిత్ర కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ లు ఉన్నాయి. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది మరో హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రతిరోజూ పండగే 18 కోట్ల మేర బిజినెస్ చేసింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కలిపి 3.21 కోట్లు వసూలు చేయడంతో టీమ్ హ్యాపీగా ఉంది. రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇక్కడ చూద్దాం

నైజాం – 1.25 కోట్లు

సీడెడ్ – 0.34 కోట్లు

గుంటూరు – 0.30 కోట్లు

ఉత్తరాంధ్ర – 0.34 కోట్లు

తూర్పు గోదావరి – 0.30 కోట్లు

పశ్చిమ గోదావరి – 0.22 కోట్లు

కృష్ణా – 0.22 కోట్లు

నెల్లూరు – 0.18 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం – 3.13 కోట్లు

సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పించారు. థమన్ అందించిన పాటలు అందరినీ అలరించిన విషయం తెల్సిందే.

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన తర్వాతి చిత్రం సోలో బ్రతుకే సో బెటరు సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ప్రతిరోజూ పండగే చిత్రానికి మంచి ఆరంభం లభించడంతో ప్రమోషనల్ టూర్ ఒకటి ప్లాన్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.