30 కోట్లు: మైండ్ బ్లాక్ చేసేస్తున్న ప్రతిరోజూ పండగే


30 కోట్లు: మైండ్ బ్లాక్ చేసేస్తున్న ప్రతిరోజూ పండగే
30 కోట్లు: మైండ్ బ్లాక్ చేసేస్తున్న ప్రతిరోజూ పండగే

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే బాక్స్ ఆఫీస్ ప్రభంజనానికి ట్రేడ్ విశ్లేషకులు కూడా విస్తుపోతున్నారు. సినిమా ఫలితాలు కొన్ని అనూహ్యంగా ఉంటాయి. కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా కానీ వసూళ్లు అంతగా రావు, కానీ కొన్ని సినిమాలు యావరేజ్ కంటెంట్ తోనే రెచ్చిపోతుంటాయి. ప్రతిరోజూ పండగే ఇదే కోవకి చెందే చిత్రం. ఈ సినిమాకు మొదట వచ్చిన రివ్యూలకు, ఇప్పుడు వస్తున్న వసూళ్లకు ఏ మాత్రం పొంతన లేదు. చాలా యావరేజ్ రివ్యూలు వచ్చాయి ఈ సినిమాకు. అన్ని రివ్యూలు చూసుకుంటే సగటున 2.75 వస్తుంది. అలాంటి ఈ చిత్రం క్రిస్మస్ సెలవుల అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని బ్రేక్ ఈవెన్ అవుతుందిలే అనుకున్నారు అందరూ. అయితే ప్రతిరోజూ పండగే రోజులు గడుస్తున్నా ఎక్కడా స్లో అవుతున్నట్లు కనిపించట్లేదు. తొలి రోజు చాలా నెమ్మదిగా తన రన్ ను మొదలుపెట్టిన ఈ చిత్రం, తొలి వీకెండ్ గడిచేసరికే హిట్ అవుతుందన్న నమ్మకాన్ని కలిగించింది. ఇక వీక్ డేస్ లో కూడా ఈ సినిమా స్లో అవ్వకపోవడంతో సూపర్ హిట్ అవుతుందని 20 కోట్లు టచ్ చేస్తుందని ఊహించారు.

అయితే క్రిస్మస్ రోజున ప్రతిరోజూ పండగే మైండ్ బ్లోయింగ్ నంబర్స్ ను నమోదు చేసింది. ఆరోజు విడుదలైన సినిమాల కంటే ఈ చిత్రం భారీ వసూళ్లు తెచ్చుకుంది. ఇక రెండో వీకెండ్ లో కూడా ఈ సినిమా ఎక్కడా తగ్గలేదు. మొన్న న్యూ ఇయర్ రోజున అయితే తొలిరోజు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి అందరినీ విస్తుపోయేలా చేసింది. ఇక నిన్నటి వసూళ్లు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. నిన్నటితో ప్రతిరోజూ పండగే 30 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటికే సాయి తేజ్ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం, మారుతి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ భలే భలే మగాడివోయ్ షేర్ ను అధిగమించడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. సంక్రాంతి వరకూ ప్రతిరోజూ పండగే చిత్రానికి ఎదురు వచ్చే సినిమానే లేదు. దాంతో ప్రతిరోజూ పండగే 35 కోట్ల మార్క్ ను కూడా అధిగమించవచ్చు. ఈ మధ్య కాలంలో అన్ని ప్రాంతాల బయ్యర్లు లాభాల బాట పట్టిన చిత్రం ఇదే అని చెప్పుకోవచ్చు.