కొండా రెడ్డి బురుజు…చేతిలో గొడ్డలి.. పైగా ఆర్మీ పాత్ర…

 

Sarileru Neekevvaru
Sarileru Neekevvaru

కామెడీ మరియు మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు రూపిందించే దర్శకుల లిస్ట్ లోకి ‘అనిల్ రావిపూడి’ గారు కూడా చేరిపోయారు. ఎస్.ఎస్.రాజమౌళి, శివ కొరటాల తర్వాత అంత గొప్ప పేరు పొందిన దర్శకుడు కూడా మన అనిల్ గారే. ఇప్పుడు సూపర్ స్టార్  ప్రిన్స్ ‘మహేష్ బాబు‘ గారిని డైరెక్ట్ చేస్తున్న తన 5 వ సినిమా “సరిలేరు నీకెవ్వరూ” మీద మహేష్ అభిమానులు తెగ ఆసక్తిగా ఉన్నారు.

భరత్ అనే నేను, మహర్షి సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న తన 26 వ సినిమా గురించి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ఎదురు చూస్తుంది.మొదటి సారి ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్, అలాగే ఫస్ట్ పాటని కూడా రిలీజ్ చేసారు సినిమా వాళ్ళు. ఒకటి మహేష్ పుట్టిన రోజునాడు అయితే, ఇంకొకటి ఆగస్ట్ 15 న విడుదల చేసారు. ఆ రెండింటికి మంచి పేరు వచ్చింది.

అయితే నిన్న ట్విట్టర్లో అనిల్ గారు “రేపు సాయంత్రం 5 గంటలకి సినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. మహేష్ బాబు గారి అభిమానులు అందరూ రెడీ గా ఉండండి.. మీరు ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అలానే చూడొచ్చు, ఇది దసరా కానుక” అని అన్నారు. అప్పటి నుండి మహేష్ బాబు అభిమానులు 5 వ గంట ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది.

కర్నూల్ కొండా రెడ్డి బురుజు ముందు చేతిలో గొడ్డలి పట్టుకొని ఆర్మీ ప్యాంటు ధరించిన మహేష్ బాబు
శత్రువుల మీద దండెత్త దానికి సిద్ధంగా ఉన్న పోస్టర్ ని చూస్తుంటే ఒకప్పటి మహేష్ బాబు ‘ఒక్కడు‘ సినిమా గురుస్తోంది అందరికి.

సినిమాలో మహేష్ బాబు కి జంటగా రష్మిక మందన్న నటిస్తున్నారు. కీలక పాత్రల్లో విజయశాంతి గారు, సంగీత, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ నటిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పూజ హెగ్డే ఐటెం సాంగ్ లో మెరవగా, తమన్నా పరిచయ గీతంలో నటించబోతుంది అని సినిమా మీద బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాని ‘రామ బ్రహ్మ సుంకర’, ‘దిల్ రాజు’, మహేష్ బాబు ముగ్గురు నిర్మిస్తున్నారు. సినిమా 10 జనవరి 2020 సంక్రాంతికి విడుదల కాబోతుంది.