రాజమండ్రిలో బరితెగించిన A.C.E ప్రైవేట్ హాస్పిటల్


private hospital fraud in Rajamundry
private hospital fraud in Rajamundry

అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు విక్టరీ వెంకటేష్ నటించిన గణేష్ అనే సినిమాలో ఆరోగ్యాన్ని ఎలా వ్యాపారంగా చేస్తారో చూసా. తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమాలో శవాన్ని అడ్డంపెట్టుకుని వైద్యం చేసిన ప్రైవేట్ హాస్పిటల్ గురించి చూపిస్తే నవ్వుకుని బాధపడ్డా. ఆ తర్వాత జీవా హీరోగా నటించిన “ఈ” అనే సినిమా చూశాను అందులో డాక్టర్లు డబ్బుల కోసం లేని రోగాలను ఎలా సృష్టిస్తారు నకిలీ మందులతో జనాలను ఎలా మోసం చేస్తారో చూసి కోపం వచ్చింది. ఈ మధ్యనే తమిళ అగ్రనటుడు విజయ్ నటించిన మెర్సెల్ అనే సినిమాలో, కూడా ఆరోగ్యాన్ని మనదేశంలో ఎలా వ్యాపారంగా మార్చి డబ్బులు సంపాదిస్తున్నారో చూపించారు.

ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది; విలన్ క్యారెక్టర్ S.J సూర్య తో, అతని జూనియర్ డాక్టర్, పేషంట్ కి నార్మల్ డెలివరీ చేద్దామా.? అని అడుగుతాడు. అప్పుడు విలన్ సిజేరియన్ చేద్దామని చెప్తూ, ఒక 30 ఏళ్ల తర్వాత ఇదే జనాలు నార్మల్ డెలివరీ వద్దు సిజేరియన్ చేయమని బతిమాలతారని, భవిష్యత్తు గురించి చెబుతాడు.

ప్రస్తుతం బయట కొంతమంది డాక్టర్లు ప్రవర్తించే తీరు పైన చెప్పిన ఉదాహరణల కి ఏ మాత్రం తీసిపోనంత భయంకరంగా ఉంది. రాజమండ్రిలో A.C.E హాస్పిటల్ తమ హాస్పిటల్ కి పేషంట్లను తీసుకొచ్చిన వాళ్లకి బట్టల షాపులో ఇచ్చినట్టు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.

· ఒకరిని తీసుకొస్తే ఒక గిఫ్ట్ కార్డు

· ఐదుగురు పేషెంట్లను తీసుకొస్తే 2000

· పదిమందిని తీసుకొస్తే 5000

· పాతిక మంది పేషంట్లని తీసుకొస్తే 10000 ఇలా ఏమాత్రం సిగ్గులేకుండా పబ్లిసిటీ చేసింది.

సాధారణంగా మన ఊర్లో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ లకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. అందుకే జబ్బు తీవ్రత తో సంబంధం లేకుండా, ఎటువంటి సమస్య వచ్చినా, సిటీకి తీసుకువచ్చి ముందు డాక్టర్ కి చూపించినా – చూపించకపోయినా టెస్టులు స్కానింగ్ ఎక్స్ రే లు, హెల్త్ ప్యాకేజీలు అంటూ ఖర్చు పెట్టిస్తారు.

తాజాగా సోషల్ మీడియాలో ఈ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న అరాచకాల మీద వైరల్ అయిన నేపథ్యంలో సంబంధిత అధికారులు హాస్పటల్ వర్గాలను పిలిపించి విచారించి ప్రాథమికంగా కొన్ని కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎలాగూ వాళ్ళు డబ్బులు తీసుకుని నాలుగు రోజుల తర్వాత సైలెంట్ అయిపోవటం; వీళ్లు కొత్తరకంగా వ్యాపారం చేయడం; జనాలు డబ్బులు ఎదురు ఖర్చు పెట్టుకొని మరి గంటల తరబడి ఆస్పత్రులలో పడిగాపులు కాయటం మామూలే ఇదంతా…