లాక్‌డౌన్‌లో ఆ రెండే వాడిన స్టార్ క‌మెడియ‌న్‌!


లాక్‌డౌన్‌లో ఆ రెండే వాడిన స్టార్ క‌మెడియ‌న్‌!
లాక్‌డౌన్‌లో ఆ రెండే వాడిన స్టార్ క‌మెడియ‌న్‌!

`నా చావు నేనే చ‌స్తా నీకెందుకు` అంటూ `పెళ్లిచూపులు` సినిమాతో క‌మెడియ‌న్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు ప్రియ‌ద‌ర్శి పులికొండ‌. తెలుగు సినిమాకు త‌న‌దైన మార్కు హాస్యాన్ని ప‌రిచ‌యం చేసి స్టార్ క‌మెడియ‌న్ అనిపించుకుంటున్నారు. హీరోల‌కు ఫ్రెండ్‌గా, స‌పోర్టింగ్ ఆర్టిస్ట్‌గా `మల్లేశం` వంటి చిత్రాల్లో హీరోగా న‌టిస్తున్నాడు. క‌మెడియ‌న్‌గా తన‌దైన మార్కు హాస్యాన్ని పండిస్తూనే మ‌రో ప‌క్క కీల‌క పాత్ర‌ల్లో రాణిస్తున్నాడు.

సినిమాల్లో న‌టిస్తూనే కీల‌క పాత్ర నేప‌థ్యంలో సాగే వెబ్ సిరీస్‌ల‌కూ సై అంటున్నాడు. గ‌తంలో త‌రుణ్ భాస్క‌ర్ రూపొందించిన `బీటెక్ బ్యాచ్‌` లో న‌టించిన ప్రియ‌ద‌ర్శి ఇటీవ‌ల అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించిన `లూజ‌ర్‌`లో న‌టించి మెప్పించిన విష‌యం తెలిసిందే. జీ5లో విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ ప్రియ‌ద‌ర్శికి మంచి పేరు తెచ్చిపెట్ట‌డ‌మే కాకుండా మంచి విజ‌యాన్ని సాధించింది.

ఇదిలా వుంటే గ‌త మూడు నెల‌లుగా అంద‌రిలాగే  ప్రియ‌ద‌ర్శి కూడా లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న సినిమాల విష‌యాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల్ని కూడా పంచుకుంటున్నాడు. తాజాగా ఇన్‌స్టా గ్రామ్ వేదిక‌గా ప్రియ‌ద‌ర్శి పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మార‌డ‌మే కాకుండా నవ్వులు పూయిస్తోంది. ఇంటి దండెం మీద వేలాడుతున్న మాస్క్‌, ఓ షార్ట్ ఫొలోల‌ని షేర్ చేసిన ప్రియ‌ద‌ర్శీ `#ఎసెన్సియ‌ల్స్ #2020 సో ఫార్‌` అని ఫ‌న్నీగా పోస్ట్ పెట్ట‌డం ఆక‌ట్టుకుంటోంది.

 

View this post on Instagram

 

#essentials #2020SoFar

A post shared by Priyadarshi (@preyadarshe) on