రిస్క్ చేస్తున్న హాస్య నటుడుPriyadarshi ready to risk his career

ప్రముఖ హాస్య నటుడు ప్రియదర్శి దర్శకుడిగా మారనున్నాడు . పెళ్లిచూపులు చిత్రంతో సంచలనం సృష్టించిన నటుడు ప్రియదర్శి . నాచవు చస్తా నీకెందుకు అనే డైలాగ్ తో థియేటర్ లో నవ్వుల పువ్వులు పూయించిన ప్రియదర్శి ప్రస్తుతం ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు . అయితే నటుడిగా హాయిగా కొనసాగుతుండగా దర్శకుడిగా మారాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు .

 

డైరెక్షన్ అంటే పెద్ద రిస్క్ అయినాసరే ఆ రిస్క్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు ప్రియదర్శి . ఇప్పటికే పలువురు నటులు దర్శకులుగా మారి కెరీర్ ని రిస్క్ లో పెట్టుకున్నారు . ప్రియదర్శి వాళ్ళ లా కెరీర్ ని రిస్క్ లో పడేయకుండా ఉంటే చాలు . డైరెక్షన్ లో విఫలం అయితే సినిమాలు కూడా తగ్గిపోతాయి నటుడిగా . ఈ విషయాలు తెలిసినప్పటికీ ప్రియదర్శి మాత్రం రిస్క్ చేయడానికే సిద్ధం అవుతున్నాడు .

 

English Title: Priyadarshi ready to risk his career