ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో రఫ్ఫాడిస్తోంది


ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో రఫ్ఫాడిస్తోంది
ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో రఫ్ఫాడిస్తోంది

హీరోయిన్ గా టాప్ హీరోల సరసన నటించింది ప్రియమణి. ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున, రవితేజ వంటి వారి సరసన లభించినా కానీ ప్రియమణి ఎప్పుడూ టాప్ లీగ్ లోకి వెళ్ళలేదు. గ్లామర్ పరంగా పెద్ద అడ్డంకులు కూడా ప్రియమణి చెప్పింది లేదు. బికినీలో కనిపించడానికి కూడా వెనకాడలేదు. అయితే మరి కాలం కలిసిరాకో మరొకటో కానీ ప్రియమణి కెరీర్ అనుకున్నంతగా ముందుకు కదిలింది లేదు. అయితే కెరీర్ లో కదలిక లేకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఇరగదీస్తోందని చెప్పాలి. ఆమెకు ఈ విషయంలో వెబ్ సిరీస్ లు చాలా సహాయం చేస్తున్నాయి. కొత్త అవకాశాలు రావడంతో ప్రియమణి కెరీర్ ప్రస్తుతం దూసుకుపోతోంది.

ప్రియమణి బాలీవుడ్ లో నటించిన సినిమా అతీత్. ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. తన కూతురుని రక్షించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లే తల్లిగా ప్రియమణి మెప్పించింది. దీనికి రివ్యూలు కూడా బాగా వస్తుండడంతో ప్రియమణి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ లో హీరో భార్యగా కీలకమైన పాత్ర పోషించింది. ఆమె కెరీర్ కు ఒక సస్పెన్స్ ను కూడా పెట్టారు. సెకండ్ సీజన్ లో అది చాలా కీలకం కానుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రియమణి రీ ఎంట్రీ ఇస్తోంది. వెంకటేష్ నారప్పలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది. సీనియర్ వెంకటేష్ భార్యగా నటిస్తోంది ప్రియమణి. అంతే కాకుండా రానా దగ్గుబాటి విరాటపర్వంలో ఈమె మాజీ నక్సలైట్ పాత్రను పోషించనుందని తెలిసింది. ఇవి కాకుండా కన్నడలో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిసింది. మరో రెండు వెబ్ సిరీస్ లు ఆమె చేతిలో ఉన్నాయి.

ఈ విధంగా కేవలం సినిమాలనే కాకుండా డిజిటల్ విప్లవాన్ని కూడా వాడుకుని అవకాశాలు సృష్టించుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతాలు చేస్తోంది ఈమె.