గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో మెరిన జంట‌!

Priyanka, and Nik Hulchul at goden globe awards function
Priyanka, and Nik Hulchul at goden globe awards function

హాలీవుడ్‌లో ఏ చిన్ని ఫంక్ష‌న్ జ‌రిగిన ట‌క్కున హాజ‌ర‌వుతున్న జంట ప్రియాంక చోప్రా, నిక్ జోన‌స్. ప్రేమించి పెద్ద‌ల అంగీకారంతో ఒక్క‌టైన ఈ జంట ఏఫంక్ష‌న్ త‌గిలినా అక్క‌డ జంట‌గా వాలిపోతున్నారు. అక్క‌డ డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ ఫ్యాష‌న్ డ్రెస్సులో ద‌ర్శ‌న‌మిస్తూ ర‌చ్చ చేస్తున్నారు. ఇటీవ‌ల మెట్ గాలా, పీపుల్స్ ఛాయిస్ అవార్డు వేడుక‌ల్లో అక్క‌డికి వ‌చ్చిన వారిని త‌మ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో మెస్మ‌రైజ్ చేసిన ఈ జోడీ తాజాగా మ‌రో అవార్డు ఫంక్ష‌న్ కి జంట‌గా హాజ‌రై హంగామా చేయ‌డం ఆస‌క్తికరంగా మారింది.

77వ ప్ర‌తిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఆదివారం కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్ట‌న్ హోట‌ల్‌లో జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో హాఫ్ షోల్డ‌ర్ పింక్ గౌన్‌లో ప్రియాంక ర‌చ్చ చేసింది. నిక్ జోన‌స్ బ్లాక్ సూట్‌ని ధ‌రించి ఆక‌ట్టుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి నిక్‌, ప్రియాంక ఒక‌రి చేతులు ఒక‌రు ప‌ట్టుకుని జంట‌గా రావ‌డం అక్క‌డున్న వారిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల‌ని ప్రియాంక సోష‌ల్ మీడియా ఇన్‌స్టా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. గులాబీ వ‌ర్షం స్వీవ్‌లెస్ గౌనులో ప్రియంక మెరిసిపోతున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

గ‌త ఏడాది బాలీవుడ్‌లో ప్రియాంక న‌టించిన `స్కై ఈజ్ పింక్‌`అనూహ్య విజ‌యాన్ని సాధించి ప్రియాంక‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా ఫ‌ర్హాన్ అక్త‌ర్ న‌టించారు. సొనాలి బోస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.