మరో హాలీవుడ్ మూవీలో ప్రియాంక చోప్రా


మరో హాలీవుడ్ మూవీలో ప్రియాంక చోప్రా
మరో హాలీవుడ్ మూవీలో ప్రియాంక చోప్రా

ఇప్పుడు మనుషులు ఎలా బతుకుతున్నారో సరిగ్గా 20 ఏళ్ళ క్రితమే ఊహించి సినిమాగా తీసారు ఇద్దరు జీనియస్ ట్విన్స్ . లానా వాచోవ్ స్కీ బ్రదర్స్. మనం బతుకుతున్న ఈ ఊహా ప్రపంచం ఏ మాత్రం నిజం కాదు. ఒక మనిషిని పూర్తిగా తనవైపుకు తిప్పుకున్నది ఈ ఆధునిక టెక్నాలజీ. ఆ కథ ప్రధాన అంశంగా మ్యాట్రిక్స్ సినిమా వచ్చింది. ఇప్పటిదాకా ఈ సీరీస్ లో మూడు సినిమాలు వచ్చాయి. వర్చువల్ ప్రపంచంలో బానిసలుగా అయిపోయిన మనుషుల కథ యిన మ్యాట్రిక్స్ సిరీస్ మూడు సినిమాలు కలిపి ఇప్పటిదాకా 1.6 బిలియన్స్ వసూలు చేసాయి.

ఇప్పుడు ఆ సీరీస్ లో నాలుగో సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమాలో గత మూడు సినిమాలుగా హీరో పాత్ర అయిన “నియో ది వన్” గా మనల్ని అలరించిన కియోన్ రీవ్స్ కొనసాగుతున్నాడు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో బాలీవుడ్ బ్యూటీ, ప్రియాంకా చోప్రా నటిస్తోంది. “బెవాచ్” ప్రాజెక్ట్ తరువాత ప్రియాంక వరుసగా హాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. ఇక తన భర్త నిక్ జోనాస్ తో కలిసి అమెజాన్ ప్రైమ్ లో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది. మాధురీ దీక్షిత్ జీవితమాధరంగా హాలీవుడ్ లో రాబోయే ఒక ప్రాజెక్ట్ కి కూడా ప్రియాంక కమిట్ అయినట్లు సమాచారం. మే 21 వ తేదీ 2021 న మ్యాట్రిక్స్ 4 రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.