నిక్ జోనాస్ తో ప్రియాంక వివాహ నిశ్చితార్థం


priyanka chopra nick jonas engagement 

తనకంటే పదేళ్ల చిన్నవాడైన నిక్ జోనాస్ ని పెళ్ళాడడానికి రెడీ అయ్యింది ప్రియాంక చోప్రా . ఈరోజు ఉదయం ముంబై లోని ప్రియాంక ఇంట్లో సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు ప్రియాంక తో పాటు నిక్ జోనాస్ లు . ఈ పూజతో ఎంగేజ్ మెంట్ పూర్తయ్యింది ఇక ఈ సాయంత్రం పలువురు ప్రముఖులకు భారీ ఎత్తున పార్టీ ఇవ్వనున్నారు . హాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి వెళ్లిన ప్రియాంక చోప్రా సినిమాల సంగతి పక్కన పెడితే అక్కడ ప్రియుడ్ని మాత్రం పట్టేసింది . తనకు నచ్చిన నిక్ జోనాస్ తో జీవితం పంచుకోవడానికి రెడీ అయ్యింది .

వయసులో చిన్నవాడు అయినప్పటికీ ప్రియాంక మాత్రం వెనుకడుగు వేయలేదు . గతకొంత కాలంగా నిక్ జోనాస్ తో ప్రియాంక చోప్రా ప్రేమాయణం సాగిస్తోంది అంటూ కథనాలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు , వివరణ ఇవ్వలేదు కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా ఎంగేజ్ మెంట్ చేసుకొని తన ఉద్దేశాన్ని చాటిచెప్పింది . ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ లు ఒక్కటి అవుతున్న సందర్బంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి .

English Title:  priyanka chopra nick jonas engagement