ప్రతి పుట్టినరోజుకు సప్రైజ్ ఇవ్వాలనుకునేవాళ్ళం..ప్రియాంక చోప్రా


Priyanka Chopra shares emotional note on dad’s birthday
Priyanka Chopra shares emotional note on dad’s birthday

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని ఇప్పుడు హాలీవుడ్ కెళ్ళి అక్కడ కూడా తన సత్తాని ఛాతుంది.. ప్రముఖ గాయకుడు నిక్ జోనాస్ ను వివాహమాడారు.. ముఖ్య విషయం ఏంటంటే ఆగస్ట్ 24 తన తండ్రి అశోక్‌ చోప్రా జయంతిని పురస్కరించుకుని సోషల్‌మీడియాలో ఆవేదనతో ఓ పోస్ట్‌ పెట్టారు. ఆయనకు ఇష్టమైన పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో జత చేసి తన తండ్రి ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘మీ ప్రతి పుట్టినరోజుకు నేను, సిద్ధార్థ్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేయాలని అనుకునేవాళ్లం. కానీ చేయలేకపోయేవాళ్లం. ఎందుకంటే మీకు మేం చేసేవన్నీ ముందే తెలుసు. మీరెక్కడున్నా.. ప్రతిరోజూ మాతో ఉన్నట్లే అనిపిస్తుంది. నేను చేసే ప్రతి పనిలో మీ ప్రోత్సాహం కనిపిస్తుంది. నేను ఎంచుకునే ప్రతి విషయంలో మీ అంగీకారం కోరుతాను. నాకు జరిగే ప్రతి విషయంలో మీ ఆశీర్వాదాలు ఉన్నాయి. హ్యాపీ బర్త్‌డే డ్యాడ్‌. మీరు ప్రతిరోజూ నాతోనే ఉంటే బాగుండనిపిస్తోంది’.. అని ప్రియాంక పేర్కొన్నారు బాధతో.. నెటిజన్లు అందరు విషెష్ తెలుపుతూ ప్రియాంకకు సానుభూతిని తెలియజేస్తున్నారు.. !!