లీకైన భారీ చిత్రం సాహో నా అరవింద సమేత నా


producer allu aravind hints about upcoming movie leaksఇటీవలే కొన్ని చిత్రాల తాలూకు వీడియో ఫుటేజీ లీక్ కావడం సంచలనంగా మారింది . అలా లీకైన చిత్రాల్లో గీత గోవిందం చిత్రం ఒకటి కాగా మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయట అయితే అందులో ఓ భారీ చిత్రం కూడా ఉన్నట్లు తెలుస్తోంది . భారీ చిత్రం అనగానే ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో పాటుగా ప్రభాస్ నటిస్తున్న సాహో పేరు కూడా వినిపిస్తోంది అయితే ఈ రెండు చిత్రాల్లో ఆ భారీ చిత్రం ఏది ? లేకపోతే ఈ రెండు కాకుండా మరో చిత్రమేదైనా ఉందా ? ఇప్పుడు అందర్నీ తొలుస్తున్న ప్రశ్న ఇది .

అయితే గీత గోవిందం చిత్రాన్ని లీక్ చేసిన వాళ్ళను పట్టుకున్నారు . హార్డ్ డిస్క్ లు పోలీసుల అదుపులో ఉన్నాయి కాబట్టి భారీ చిత్రాలకు వచ్చిన ముప్పు అంటూ ఏమిలేదు . కాకపోతే భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమాల తాలూకు బృందానికి బోలెడు తలనొప్పులు ఉంటాయి , షూటింగ్ అని షెడ్యూల్ అని ఆర్టిస్టుల డేట్స్ అని వాటితో పాటుగా రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి వాటిని అన్నింటిని చూసుకుంటూ సినిమా ఫుటేజీ ని కూడా కాపాడుకోవాలనే తర్కం బోధపడింది ఇప్పటికి . ఇప్పటికే పలు చిత్రాల ఫుటేజీ లీకైన విషయం తెలిసిందే . అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అవి లీక్ అవుతూనే ఉన్నాయి . అయితే అల్లు అరవింద్ చెప్పిన భారీ చిత్రం ఎన్టీఆర్ దా ? లేక ప్రభాస్ దా ? అన్న అనుమానం తలెత్తుతోంది .

English Title: producer allu aravind hints about upcoming movie leaks