రజనీకాంత్ సినిమాని కొనలేదట


Producer C. Kalyan dined rumours on Rajinikanth's petta

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన  తమిళ చిత్రం పెట్టా ని నిర్మాత సి కళ్యాణ్  తెలుగులో డబ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి , అంతేకాదు సంక్రాంతి బరిలో పెట్టా చిత్రాన్ని విడుదల చేయడం కష్టం కాబట్టి ఆ చిత్రాన్ని తమిళ్ తో పాటుగా విడుదల చేయడం లేదని కూడా వార్తలు వచ్చాయి . కట్ చేస్తే అసలు నేను రజనీకాంత్ చిత్రాన్ని కొనలేదని , అసలు ఆ సినిమా కోసం పోటీ పడలేదని స్పష్టం చేసాడు నిర్మాత సి . కళ్యాణ్ .

 కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం పెట్టా . ఇటీవలే పెట్టా ట్రైలర్ విడుదల చేసారు . రజనీ అభిమానులను విశేషంగా అలరించేలా ఆ ట్రైలర్ రూపొందింది . ఇక 2. ఓ చిత్రం హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడం విశేషం . అయితే 2019 లో సంక్రాంతి బరిలో చాలా చిత్రాలు పోటీ పడుతున్నాయి దాంతో థియేటర్ ల సమస్య కూడా ఉంటుంది మరి . సి . కళ్యాణ్ ఈ సినిమా కొనలేదని స్పష్టం చేసాడు . మరి ఈ సినిమాని దక్కించుకునే వాళ్ళు ఎవరో ?
 English Title: Producer C. Kalyan dined rumours on Rajinikanth’s petta