రెండు కొత్త చిత్రాలు నిర్మించబోతున్న చంటి అడ్డాల


రెండు కొత్త చిత్రాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. కళా దర్శకుడిగా కెరీర్ ను ఆరంభించి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన ఆయన నిర్మాతగా మారి పలువురు ప్రముఖ హీరోలతో అభిరుచి కలిగిన చిత్రాలను నిర్మించారు. వాటిలో ప్రభాస్ నటించిన అడవిరాముడు, జూ.ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు చిత్రాలున్నాయి. ఆదివారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చంటి అడ్డాల మాట్లాడుతూ, సినీరంగంలో 38 సంవత్సరాల అనుభవం గడించుకున్నాను. ఇప్పటివరకు పది సినిమాలను నిర్మించాను. ప్రేక్షకుల అభిరుచి, ట్రెండ్ కు తగ్గట్టుగా చక్కటి చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన నేను అదే పంథాలో మరో రెండు చిత్రాల నిర్మాణానికి సంకల్పించాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన ఆయన శిష్యుడు హరిహరన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ…ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తీయబోతున్నాం. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన ఆయన శిష్యుడు సుబ్బును దర్శకుడిగా పరిచయం చేస్తూ..వేరొక చిత్రాన్ని నిర్మించబోతున్నాం…యూత్ ఫుల్ కథాంశంతో నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుంది. ఈ రెండు చిత్రాలలో ఏది ముందు ప్రారంభమవుతుంది?. వాటిలో నటించే హీరోలు ఎవరు? మిగతా అన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాం. ఈ రెండు సినిమాలు దేనికేదే ప్రేక్షకులు నచ్చే, మెచ్చేవిధంగా మంచి కథలు రూపొందాయి అని చెప్పారు.