డ్రగ్స్ తీసుకుంటారని ఓపెన్ గా చెప్తున్నాడు


producer daggubati suresh babu sensational comments on drugs caseసినిమారంగంలో డ్రగ్స్ తీసుకొని కథలు రాసేవాళ్ళు , షూటింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని అంతేకాదు వాళ్లంతా చాలా పెద్దవాళ్ళని ఒకవేళ వాళ్లపై యాక్షన్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అవలీలగా తప్పించుకుంటారని కేవలం చిన్నవాళ్లు మాత్రమే దొరుకుతారని సంచలన వ్యాఖ్యలు చేసాడు అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు . కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసు తెలుగు సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపేసింది దాంతో కొంతమంది సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి ఎక్కడ దొరికిపోతామో అని . అయితే నెల రోజుల పాటు మాత్రం మీడియాలో తెగ హంగామా మొదలయ్యింది . లైవ్ ల మీద లైవ్ కార్యక్రమాలతో హోరెత్తిపోయింది ఆ నెల రోజులు .

కట్ చేస్తే ….. …. డ్రగ్స్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో కొద్దిరోజుల తర్వాత అంతే సైలెంట్ అయిపొయింది దాంతో మిగతా కేసు ల్లాగే డ్రగ్స్ కేసు కూడా అయిపోయిందని వాపోయారు తప్ప ఆ ఆతర్వాత ఎవరూ పట్టించుకోలేదు . అయితే ఆ విషయాలను ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు . డ్రగ్స్ వాడేవాళ్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారని , వాళ్ళని బ్యాన్ చేయడం వల్ల ప్రయోజనం అంటూ ఏమి ఉండదని , ఛాంబర్ పరంగా చర్యలు తీసుకోవాలని అనుకున్నామని కానీ దాని వల్ల ఎటువంటి ఫలితాలు రావని అంటున్నాడు . ఎందుకంటే ఇది ఏ ఒక్కరినో కంట్రోల్ చేయగలిగే సంస్థ కాదని , టాలెంట్ ఉన్నవాళ్లే ఇక్కడ రాణిస్తారు కాబట్టి అని అంటున్నాడు సురేష్ బాబు . ఈ నిర్మాత చెప్పేదాంట్లో నిజం ఉంది , అయితే తెరవెనుక పెద్ద మంత్రాంగమే నడిచింది కాబట్టి డ్రగ్స్ కేసు మూలన పడింది .