దిల్ రాజు కూడా ఓటీటీకి జై కొడుతున్నారా?


దిల్ రాజు కూడా ఓటీటీకి జై కొడుతున్నారా?
దిల్ రాజు కూడా ఓటీటీకి జై కొడుతున్నారా?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. సినిమా రంగం విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ స‌మ‌యంలో సినీ రంగానికి ప్ర‌ధాన మార్గంగా నిలిచింది ఓటీటీ ప్లాట్ ఫామ్. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇంటి ప‌ట్టునే వుంటున్న జ‌నం వినోదం కోసం ఓటీటీల‌ని ఆశ్ర‌యిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు నిర్మించ‌డానికి ముందు కొస్తున్నాయి. రీసెంట్‌గా  మెగాడాట‌ర్ సుస్మిత, ఆమె భ‌ర్త వెబ్ సిరీస్ నిర్మాణంలోకి ఎంట‌ర‌వుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ రంగంలోకి దిల్ రాజు కూడా ఎంట‌ర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే ప్ర‌త్య‌క్ష్యంగా కాకుండా ప‌రోక్షంగా దిల్ రాజు ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్టు తెలిసింది. `హిట్‌` డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను క‌థ‌తో ఎడిట‌ర్ గ్యారీని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ హీరో విశ్వ‌క్‌సేన్ నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ రూపొందుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ని ఓటీటీల‌కు దిల్ రాజు సేల్ చేయ‌బోతున్నార‌ట‌.