మరొక కొత్త ప్రయత్నం – “నేను లేని నా ప్రేమకథ”మరొక కొత్త ప్రయత్నం – “నేను లేని నా ప్రేమకథ”
మరొక కొత్త ప్రయత్నం – “నేను లేని నా ప్రేమకథ”

“మనం పెద్ద హీరో కాకపోయినా, పది సీన్లు లేకపోయినా, కనీసం హీరో కంటే హైలెట్ కాకుండా ఉండాలని.., మేకప్ కాస్ట్యూమ్స్, లైటింగ్, డైలాగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా ఫర్వాలేదు. మన మీద కెమెరా పాన్ అయ్యే ఒక్క నిమిషం. అందులో 60 సెకండ్స్.. ఒక్కొక్క సెకండ్ కి 24 ఫ్రేమ్స్. మన కళ్ళతో చూపించే ఒక్క ఎక్స్ ప్రెషన్ చాలు… కుమ్మి పడేస్తుంది…! స్క్రీన్ మొత్తం.”

ఈ మాట ఒకసారి ఒక చిన్న రైటర్ 2016 లో కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ హీరో చెప్పిన మాట. ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి పేరు “నవీన్ చంద్ర”. “అరవింద సమేత” సినిమాలో ఎన్టీఆర్ లాంటి నటుడు ముందు కళ్ళల్లో కళ్ళు పెట్టి “అవును… మేమే మొదలెట్టినం.. మీరు ఆపినారా..! మేము నరికినం…మీరు తగ్గినారా..! దీనికేమంటావ్ రాఘవ రెడ్డి…!” అని తను చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఒక హైలెట్.

“అందాల రాక్షసి” సినిమాలో సూర్య గా ఆయన నటన ఏ స్థాయిలో ఉందంటే, ఆ సినిమా టైం లో లవర్స్ అయిన వాళ్ళలో అమ్మాయిలు కొంతమంది ఇప్పటికీ తన లవర్ ఒరిజినల్ పేరు కాకుండా “సూర్య” అనే పేరును వాళ్ళ లవర్ కు ఫిక్స్ చేసుకునేంత. తాజాగా గత ఏడాది “ఎవరు” సినిమాలో “DSP అశోక్ కృష్ణ” గా ఇరగదీసిన నవీన్ సర్ ఇప్పుడు మళ్ళీ “నేను లేని నా ప్రేమకథ” అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. గాయత్రి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే సినిమా ఫస్ట్ లుక్ ను దిల్ రాజు విడుదల చేసారు. ఇక ఈ సినిమా కూడా “అందాల రాక్షసి” లెవల్ హిట్ అవ్వాలని కోరుకుందాం.