మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న దిల్ రాజు


మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న దిల్ రాజు
మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న దిల్ రాజు

టాలీవుడ్‌లో నిర్మాత‌గా దిల్ రాజుది ప్ర‌త్యేక స్థానం. విభిన్న‌మైన చిత్రాల్ని నిర్మిస్తూ వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తున్నారాయ‌న‌. ఆయ‌న ఆదివారం రాత్రి మ‌ళ్లీ వివాహం చేసుకున్నారు. దిల్ రాజు భార్య అనిత మూడేళ్ల క్రితం మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత నుంచి వ్య‌క్తిగ‌తంగా బాధ‌లో వున్న ఆయ‌న దాని ప్ర‌భావం ఏ మాత్రం త‌న సినిమాల‌పై ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతూ వ‌స్తున్నారు. ఒంట‌రిగానే వుంటూ వ‌స్తున్న ఆయ‌న గ‌త కొంత కాలంగా మ‌ళ్లీ వివాహం చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్టు వార్త‌లు మొద‌ల‌య్యాయి.

అయితే ఈ వార్త‌లని దిల్ రాజు కండించ‌క‌పోవ‌డంతో ఆ వార్త‌లు నిజ‌మ‌ని అంతా భావించారు. దానికి త‌గ్గ‌ట్టే ఆదివారం ఉద‌యం ఆయ‌న మీడియా ముఖంగా ఓ ప్ర‌క‌ట‌న చేశారు. `ప్ర‌పంచం మొత్తం ప్ర‌స్తుతం వున్న క్లిష్ట‌ప‌రిస్థితుల్లో మ‌న‌లోని చాలా మంది వృత్తి ప‌రంగా  ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ‌త కొంత కాలంగా నా వ్య‌క్తిగ‌త జీవితంలో ఎలాంటి సంతోషం చోటుచేసుకోలేదు. ఈ క్లిష్ట‌ప‌రిస్థితుల‌న్నీ త్వ‌ర‌లోనే చెదిరిపోయి మ‌నం మ‌ళ్లీ అంద‌మైన జీవితాల్లోకి అడుగుపెడ‌తామ‌ని ఆశిస్తున్నాను. అలాంటి ఆశ‌తోనే త‌న వ్య‌క్తిగత జీవితాన్ని పునః ప్రారంభించాల‌నుకుంటున్నాన‌ని వెల్ల‌డించి త‌న రెండో పెళ్లిపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు దిల్ రాజు.

దిల్ రాజు వివాహం అంతా ఊహించిన‌ట్టే నిజామాబాద్‌లోని దిల్ రాజు స్వ‌గ్రామం అయిన న‌ర్సింగ్ ప‌ల్లిలోని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో రాత్రి 11 గంట‌ల‌కు జ‌రిగింది. ఈ వివాహానికి దిల్ రాజుకు అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. దిల్ రాజు వివాహానికి ఆయ‌న కుమార్తె హ‌న్షిత‌నే క‌ర్త క‌ర్మ క్రియ అని తెలిసింది. దిల్ రాజు వివాహం చేసుకున్న యువ‌తి ఎవ‌రు? ఆమె పేరేంట‌నేది మాత్రం తెలియ‌రాలేదు. హెయిర్ హోస్ట‌ర్‌గా ప‌నిచేసిన ఆమె గ‌త కొంత కాలంగా దిల్ రాజు కుమార్తె ద్వారా ప‌రిచ‌యం అని, ఆమె ఈ వివాహానికి ప్ర‌ధాన కార‌కురాలిగా నిలిచార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం దిల్ రాజు వివాహానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.