
ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి రాజు సోమవారం ఉదయం్ కన్ను మూశారు. అనారోగ్య కారణాల వలన ఇటీవల హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. నిర్మాతగా, పంపిణీ దారుడిగా, ఎగ్జిబిటర్‌గా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు.
పంపిణీ దారుడుగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన దొరసా్వమి రాజు ఆంధ్రా, తెలంగాణల్లో దాదాపు 750కి పైగా చిత్రాల్ని పంపిణీ చేశారు. నిర్మాతగా వీఎంసీ కంబైన్స్ పేరుతో సంస్థని స్థాయిపించి పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. ఈ సంస్థని స్వర్గీయ నందమూరి తారకరామారావు చేతుల మీదుగా 1978లో ప్రారంభించారు.
ఈ బ్యానర్‌పై ఆయన అక్కినేని నాగార్జునతో నిర్మించిన `కిరాయి దాదా`, ప్రెసిడెంటుగారి పెళ్లాం, అన్నమయ్య వంటి చిత్రాల్ని నిర్మించారు. ఇందులో నాగార్జున నటించిన `అన్నమయ్య` ప్రశంసలతో పాటు పలు అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన `సింహాద్రి` సంచలన విజయం సాధించి ఎన్టీఆర్‌ని స్టార్ హీరోగా నిలబెట్టింది. అక్కినేని నాగేశ్వరరావు, మీనాలతో నిర్మించిన `సీతారామయ్యగారి మనవరాలు` కూడా పలు అవార్డుల్ని తెచ్చిపెట్టింది. వి.దొరస్వామి రాజు మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో మంగళవానం ఉదయం 11 గంటలకు జరగనున్నాయి.