ఆరోపణలను ఖండించిన మహేష్ నిర్మాత


producer dvv danayya condemn rumoursమహేష్ బాబు తో భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత డివివి దానయ్య పై పలు రకాల కథనాలు మీడియాలో రావడంతో అవన్నీ వాస్తవం కాదని నేను ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టలేదని అందరికి కూడా రెమ్యునరేషన్ ఇచ్చానని అంటున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన చిత్రం ” భరత్ అనే నేను ” . వేసవిలో విడుదలైన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే కాకుండా అటు కొరటాల ఇటు డివివి దానయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది భారీ వసూళ్ల ని సాధించింది .

అయితే దర్శకులు కొరటాల శివ కు అలాగే హీరోయిన్ కైరా అద్వానీ తో పాటుగా కొంతమంది కి డివివి దానయ్య పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వలేదని , లాభాలు వచ్చినప్పటికీ అవి నొక్కేసి వాళ్లకు డబ్బులు ఎగ్గొట్టాడని కథనాలు వచ్చాయి . దాంతో ఆ కథనాలపై ఆగ్రహంగా ఉన్నాడు దానయ్య . ఎవరికైనా కావాలంటే వచ్చి లెక్కలు చూసుకోవచ్చు అంతేకాని అనవసరమైన కథనాలు రాయకండి అంటూ ఆరోపణలను ఖండిస్తున్నాడు .

భరత్ అనే నేను చిత్రం తర్వాత ఎన్టీఆర్ – చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో నిర్మించనున్నాడు డివివి దానయ్య .

English Title: producer dvv danayya condemn rumours