విడుదలకు ముందే వోల్క్స్ వాగన్ కార్ గిప్ట్ అందుకున్న చిన్న సినిమా డైరెక్టర్


Producer gifts an expensive car to director

వివరాల్లోకి వెళితే ఎలాంటి అంచనాలు లేకుండా స్టార్ట్ చేసిన నందు మూవీ ” ఇంతలో ఎన్నెన్ని వింతలో” ఈ చిత్రo షూటింగ్ పూర్తి చేసుకున్న దగ్గరనుండి మొదట చిత్ర యూనిట్ చిత్రాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతే కాకుండా ఈ చిత్ర పాజిటివ్ టాక్  తమిళ్ రిమేక్ రైట్స్ మంచి ఆఫర్ రావడం కూడా ఈ ప్రొడ్యూసర్స్ కి మరింత ఆనందాన్ని కలిగించింది ఇలా చిత్రాన్ని గురించి తెలిసిన చూసిన అందరూ నందుకి పెద్ద హిట్ అవుతుంది అని అందరూ అంటున్నారు

 

అయితే  ఈ చిత్రం విడుదలై ఎంత హిట్ అవుతుందో గాని ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ ఫ్రీ రిలీస్ హిట్ సంతోషం తో దర్శకుడు వర ప్రసాద్ వరకూటి కి వోల్క్స్ వాగన్  కార్ ని విడుదలకు ముందే గిఫ్ట్ గా ఇచ్చారని వినికిడి, అంటే ప్రొడ్యూసర్ కి సినిమా పై ఎంత నమ్మకం ఉంటే విడుదలకు ముందే డైరెక్టర్ కి కార్ గిఫ్ట్ గా ఇచ్చారో అని ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారి  ఈ చిత్రం అందరి నోళ్ళలో నానుతుంది. ఈ చిత్రం నందుకి దర్శకుడికి పెద్ద హిట్ అయ్యి ఇద్దరికి కొత్త ఆఫర్లు రావాలని ప్రొడ్యూసర్స్ నమ్మకం నిజం కావాలని మనం కూడా కోరుకుందాం.