గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారా


ks ramarao eyes on gang leader remake1991 లో విడుదలై తెలుగునాట ప్రభంజనం సృష్టించిన చిత్రం ” గ్యాంగ్ లీడర్ ”. అప్పటి వరకు ఉన్న పాత రికార్డులను బద్దలు కొట్టి చిరంజీవి స్టామినా ఏంటో నిరూపించిన చిత్రం గ్యాంగ్ లీడర్ , కాగా ఇన్నేళ్ల తర్వాత ఆ సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . 27 ఏళ్ల క్రితం జనాలను మెప్పించిన గ్యాంగ్ లీడర్ మళ్ళీ రీమేక్ చేస్తే ఎవరు చేస్తారో ఊహించడం పెద్ద కష్టం కాదు ఇంకెవరు చిరు వారసుడు రాంచరణ్ తేజ్ .

చిరంజీవి తో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాత కే ఎస్ రామారావు చరణ్ తో గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని రీమేక్ చేయాలనీ ఆలోచన చేస్తున్నాడు . అయితే ఇప్పటి కాలానికి అనుగుణంగా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేయాలని భావిస్తున్నాడు . ప్రస్తుతానికి ఆలోచన మాత్రమే చేస్తున్నాడు చరణ్ తో పాటు చిరు కూడా ఒప్పుకుంటే ఆ పనులు చక చకా జరిగిపోతాయి . ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రం చేయనున్నాడు దాని తర్వాత ఈ గ్యాంగ్ లీడర్ సెట్స్ మీదకు వెళ్లొచ్చు .