హీరో నిఖిల్ కు వార్నింగ్ ఇచ్చిన నిర్మాత


Producer nattikumar warns hero nikhil

హీరో నిఖిల్ సోమవారం లోపు క్షమాపణ చెప్పాలని లేదంటే ఆందోళన తీవ్ర తరం చేయడమే కాకుండా నిఖిల్ బండారం బయట పెడతానని హెచ్చరికలు జారీ చేసాడు నిర్మాత నట్టికుమార్ . నిన్న ముద్ర సినిమా రిలీజ్ అంటూ ప్రకటనలు జారీ చేసారు అయితే ముద్ర సినిమాలో టైటిల్ లోగో తో పాటుగా నిఖిల్ ఫోటో ని కూడా వాడారు సదరు నిర్మాతలు అయితే నిఖిల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు అంతేకాదు ఆ సినిమా నాది కాదు ఆ సినిమా చూడొద్దు అంటూ ట్వీట్ చేసాడు నిఖిల్ .

తాజాగా నిఖిల్ ముద్ర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే టైటిల్ కు నిఖిల్ కు సంబంధం లేదని , ఆ హక్కులు నాకు మాత్రమే ఉన్నాయని కానీ నాకు అనుమతి లేకుండానే నా టైటిల్ ని వాడుకుంటున్నారని నిఖిల్ పై ఆరోపణలు చేస్తున్నాడు నట్టికుమార్ . సోమవారం లోగా నిఖిల్ క్షమాపణ చెప్పకపోతే సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నాడు నట్టికుమార్ . మరి నిఖిల్ సారీ చెబుతాడా ? లేక ఈ వివాదం పెద్దది అవుతుందా ? చూడాలి .

English Title: Producer nattikumar warns hero nikhil