త్రిష‌పై నిప్పులు చెరిగిన ప్రొడ్యూస‌ర్!


Producer shiva sensational comments on Trisha
Producer shiva sensational comments on Trisha

త‌మిళ చిత్రం `96` సూప‌ర్‌హిట్ కావ‌డంతో కోలీవుడ్‌లో త్రిష డిమాండ్ పెరిగింది. దీంతో త్రిష త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా వుండ‌టానికే అధిక ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ట‌. ఆమె న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం `ప‌ర‌మ‌ప‌ద‌మ్ విల‌యాట్టు`. కె. తిరుజ్ఞానం ద‌ర్శ‌కుడు. 24 హెచ్ ఆర్ ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదొక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. మ‌హిళా ప్ర‌ధాన చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో త్రిష‌నే మెయిన్ లీడ్‌. ఈ నెల 28న రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

శ‌నివారం చెన్నైలోని స‌త్యం థీయేట‌ర్‌లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి త్రిష హాజ‌రు కాకుండా డుమ్మా కొట్టేసింది. దీంతో ద‌ర్శ‌కుడు తిరుజ్ఞానం, నిర్మాత‌లు త్రిష‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అక్క‌డే ఏర్పాటు చేసిన మీడియా కార్య‌క్ర‌మంలో నిర్మాత టి. శివ హీరోయిన్ త్రిష‌పై నిప్పులు చెరిగారు. ఈ రోజుల్లో స్టార్ హీరోలు న‌టించిన చిత్రాల‌కే ప్రాప‌ర్‌గా ప్ర‌మోష‌న్ లేక‌పోతే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు` అని ఘాటుగా స్పందించారు.

త్రిష ఇందులో మెయిన్ లీడ్‌గా న‌టించింద‌ని, ఆమె త‌ప్ప ఇందులో అంతా కొత్త‌వారేన‌ని, ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొనాల్సిన త్రిష ఇలా త‌ప్పించుకు తిర‌గ‌డం భావ్యంగా లేద‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. సినిమాని ఆమె ప్ర‌మోట్ చేయ‌క‌పోతే ఎవ‌రికి తెలుస్తుంద‌ని, కొత్త వాళ్లు ప్ర‌మోట్ చేస్తే థియేట‌ర్‌కు ప్రేక్ష‌కులు ఎలా వ‌స్తార‌ని నిర్మాత శివ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై త్రిష ఏమ‌ని స్టేట్‌మెంట్ ఇస్తుందో చూడాలి.