సునీల్ నారంగ్ ఆరోగ్యంగానే వున్నారు!Producer Sunil narangs condition is stable
Producer Sunil narangs condition is stable

ప్ర‌ముఖ పంపిణీదారుడు, నిర్మాత‌, థియేట‌ర్స్ అధినేత సునీల్ నారంగ్ ఆరోగ్యంపై వ‌దంతులొస్తున్నాయి. అయితే ఆయ‌న ఆయ‌న‌కు ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని, బాగానే వున్నార‌ని సునీల్ నారంగ్ సోద‌రుడు భ‌ర‌త్ నారంగ్ వెల్ల‌డించారు. సునీల్ నారంగ్ కు స‌డెన్‌గా గుండె నొప్పి రావ‌డంతో ఆయ‌న‌ను అపోలో ఆసుప‌త్రిలో చేర్పించారు. డాక్ట‌ర్స్ వెంట‌నే స్టంట్స్ వేయ‌డంతో ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డిన‌ట్టు తెలిసింది.

ఈ సంద‌ర్భంగా సునీల్ నారంగ్ సోద‌రుడు భ‌ర‌త్ నారంగ్ మాట్లాడుతూ ` రాత్రి స‌డెన్‌గా గుండె పోటు రావ‌డంతో అపోలో హాస్పిట‌ల్‌లో చేరారు. డాక్ట‌ర్స్ వెంట‌నే స్టంట్స్ వేశారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. రేపు డిశ్చార్జ్ అవుతారు. త‌న ఆరోగ్యం గురించి ఫోన్లు చేస్తున్న అంద‌రికీ సునీల్ నారంగ్ కృత‌జ్ఞ‌త‌లు చెప్తూ త‌నూ క్షేమంగా వున్న‌ట్లు, రేపు డిశ్చార్జ్ అవుతున్న‌ట్లు తెల‌ప‌మ‌న్నారు` అన్నారు.