ఫేక్ న్యూస్‌పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కొర‌డా!


ఫేక్ న్యూస్‌పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కొర‌డా!
ఫేక్ న్యూస్‌పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కొర‌డా!

విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తున్న నోబుల్ కాజ్‌పై విషం చిమ్మిన కొన్ని వెబ్ సైట్స్‌పై టాలీవుడ్ ఇండ‌స్ట్రీ స‌మ‌ర శంఖం పూరించింది. తప్పుడు వార్త‌లు రాస్తూ న‌టీన‌టుల వ్య‌క్తి గ‌త జీవితాల్ని ప్ర‌భావితం చేస్తున్న స‌ద‌రు వెబ్ సైట్స్‌పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కొర‌డా విధించింది. ఇక‌పై ఎవు ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చూస్తున్నార‌ని తెలిసినా వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

ఈ సంద‌ర్భంగా ఓ లేఖ‌ని విడుద‌ల చేసింది. కిల్ ఫేక్ న్యూస్‌… స్ప్రెడ్ పాజిటివిటి అనే నినాదంతో ఇన్నాళ్లుగా కొన్ని వెబ్ సైట్స్ చేస్తున్న ప్రాప‌గండ‌ని స‌హిస్తూ వ‌చ్చామ‌ని, ఇక‌పై స‌హించేది లేద‌ని లార లోకం ఏక‌మై విషం చిమ్మే వెబ్‌సైట్స్‌పై త్వ‌ర‌లో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఫేక్ న్యూస్ వెబ్ సైట్స్‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇండ‌స్ట్రీ హీరోలంతా అండ‌గా నిల‌వ‌డంపై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఒక వ్య‌క్తి త‌న స్థోమ‌త‌కు త‌గ్గ‌ట్టుగా స‌హాయం చేస్తాడు. దాన్ని కూడా రార్థాంతం చేయ‌డం క‌రెక్ట్ కాదు. సినిమా యాడ్స్ వ‌ల్ల ఆదాయం పొందుతూ స‌ద‌రు వెబ్ సైట్ సినిమా వాళ్ల‌పై త‌ప్పుడు రాత‌లు రాయ‌డం సమంజ‌సంగా లేదు. ఈ విష‌యంపై లాక్‌డౌన్ త‌రువాత కీల‌క నిర్ణ‌యం తీసుకుంటాం. ఎవ‌రైనా త‌మ‌పై ఫేక్ న్యూస్ రాసార‌ని స‌ద‌రు వెబ్‌సైట్స్‌పై యాక్ష‌న్ తీసుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ వెల్ల‌డించింది.