దాసరి ఇంట్లో గొడవలు రోడ్డున పడ్డాయ్


property dispute in dasari narayanarao familyదర్శకుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను పొందిన దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత కుటుంబంలో ఆస్థుల కోసం గొడవలు మొదలయ్యాయి . దాసరి పెద్ద కొడుకు భార్య సుశీల మళ్ళీ ఆస్థుల కోసం రోడ్డెక్కింది . దాసరి నారాయణరావు ఉన్నప్పుడే పలుమార్లు గొడవలు జరిగాయి అయితే అప్పట్లో సెటిల్మెంట్ చేయలేదు కానీ హామీ ఇచ్చాడట కానీ ఇప్పుడు ఆ పెద్దాయనే లేడు దాంతో దాసరికి డబ్బులు ఇవ్వాల్సినవాళ్లు ఆ ఇంటి ముఖం చూడటం లేదు , పైగా దాసరి సొమ్ము ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళు మిన్నకుండి పోవడంతో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి .

దాసరికి ఇద్దరు కొడుకులు ప్రభు , అరుణ్ కుమార్ లు కాగా పెద్దబ్బాయి ప్రభు మొదటి భార్య ఈ సుశీల . అయితే దాసరి ఉన్న సమయంలోనే పలుమార్లు గొడవలు అయ్యాయి , ఇక ఇప్పుడేమో దాసరి లేడు కాబట్టి తక్షణం నా వాటా నాకు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతూ రోడ్డెక్కింది . విషయం పెద్దది కావడంతో , రోడ్డు మీదకు చేరడంతో లీగల్ గా చూసుకోండని పోలీసులు ఇరు వర్గాలకు సూచనలు చేశారట . ప్రస్తుతం దాసరి చిన్న కొడుకు అరుణ్ అజమాయిషీ లో దాసరి ఆస్థులు ఉన్నాయి . మరి సుశీల కు వాటా ఇస్తారా ? లేక ఈ వివాదం ఇలాగే సాగుతుందా ? దాసరి సన్నిహితులు ఎవరైనా ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెస్తారా చూడాలి .

English Title: property dispute in dasari narayanarao family