ఇండ‌స్ట్రీలో వ్య‌భిచార ముఠాలు!


ఇండ‌స్ట్రీలో వ్య‌భిచార ముఠాలు!
ఇండ‌స్ట్రీలో వ్య‌భిచార ముఠాలు!

సినిమా ఓ రంగుల ప్ర‌పంచం. దీనిపై మోజుతో పాటు ప్రేమ వున్న వాళ్లు ఈ రంగంలో ఎలాగైనా రాణించాల‌ని, ఒక్క‌సారైనా త‌మ‌ని తాము వెండితెర‌పై చూసుకుని మురిసిపోవాల‌ని ఉవ్విళ్లూరుతుంటారు. అందు కోసం ఎలాంటి ప‌ని చేయ‌డానికైనా వెనుకాడ‌రు. ఇంట్లో వాళ్లు వ‌ద్ద‌ని వారించినా…అది మ‌న‌లాంటి వాళ్ల‌కు అంద‌ని ద్రాక్ష అని చెప్పినా ఆ మాట‌ల్ని ప‌ట్టించుకోకుండా ఇంటి నుంచి కోటి ఆశ‌ల‌తో సినీ ఇండ‌స్ట్రీ వైపు ప‌రుగులు పెట్టిన వాళ్లు ఈ మూడు ద‌శాబ్దాల్లో కోకొల్ల‌లు.

అయితే అలా వ‌చ్చిన వారు సినిమాల్లో రాణించారా?. అస‌లు అలా వ‌చ్చిన వారికి అవ‌కాశాలు చిక్కాయా?. ముఖ్యంగా అలా వ‌చ్చిన అమ్మాయిల ప‌రిస్థితేంటి?. సినిమాపై మోజుతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న వాళ్ల‌ని మాయ‌మాట‌ల‌తో మోసం చేసి కొంత మంది వ్య‌భిచార వృత్తిలోకి దించేస్తున్నారని గ‌త కొంత కాలంగా వినిపిస్తోంది. ఈ ఊబిలో చిక్కిన వాళ్లు బ‌య‌టికి రాలేక నిత్యం న‌ర‌కం అనుభ‌విస్తున్నార‌ట‌. ఇదే విష‌యం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఇది ప్ర‌చారం మాత్ర‌మేన‌ని, ఇందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని కొంత మంది ఈ ప్ర‌చారాన్ని క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌తంలో కొంత మంది వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు అదంతా లేద‌ని, అది ఒక‌ప్ప‌టి మాట‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు. కానీ తెర వెనుక మాత్రం ఇది నిత్య కృత్యంగా మారింది.  ఇండ‌స్ట్రీలో గ‌త మూడు ద‌శాబ్దాలుగా వున్న ఓ న‌టుడు గ‌త కొంత కాలంగా అమ్మాయిల వ్యాపారం చేస్తున్నట్టు వినికిడి. ఉద‌యాన్నే అంద‌రికి బూతు బొమ్మ‌లు పంపిస్తూ గుడ్ మార్నింగ్‌లు చెప్పే ఆ న‌టుడు అమ్మాయిల‌తో ఏకంగా బిజినెస్‌నే న‌డిపిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై మాత్రం ఇండ‌స్ట్రీ పెద్ద‌లు మౌనం వ‌హిస్తున్నారు. ఇలాంటి వాళ్ల ఆట క‌ట్టించిన‌ప్పుడే ఇండ‌స్ట్రీకి కొత్త వాళ్లు రావ‌డానికి ఆస‌క్తి చూపిస్తార‌ని అలాంటి చ‌ర్య‌ల‌కు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు న‌డుం బిగించాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు.