పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా `పెళ్లి` పృధ్వి!


Prudhvi intaresting charector in ee kadhalo patralu kalpitham
Prudhvi intaresting charector in ee kadhalo patralu kalpitham

పెళ్లి, పెళ్లి పందిరి, నువ్వునాకు న‌చ్చావ్ వంటి చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకున్న పృథ్వీరాజ్ మ‌ళ్లీ కొంత విరామం త‌రువాత స‌రికొత్త పాత్ర‌లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న చిత్రం `ఈ క‌థ‌లో పాత్ర‌లు క‌ల్పితం`. ప‌వ‌న్‌తేజ్ కొణిదెల హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. మాధ‌వి స‌మ‌ర్ప‌ణ‌లో ఎంవిటి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అభిరామ్ ఎం. ద‌ర్‌శ‌క‌త్వంలో రాజేష్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మేఘ‌న, ల‌క్కీ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.  థ్రిల్లింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. తాజాగా పృథ్వీరాజ్‌కు సంబంధించిన లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. కొత్త త‌ర‌హా క‌థాంశంతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ప‌లు ఆసక్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.  వరుణ్‌తేజ్ కొణిదెల‌కు ఇదే తొలి చిత్రం. అయినా అద్భుతంగా నటించాడు. ఇందులో పృథ్విరాజ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆయన పాత్ర చిత్ర‌ణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. టెక్నిక‌ల్‌గానూ చిత్రాన్నిఉన్న‌తంగా తీర్చిదిద్దుతున్నాం. `జెస్సీ`కి వ‌ర్క్ చేసిన సునీల్‌కుమార్ ఫొటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100, క‌ల్కీ చిత్రాల‌కు మాట‌లు రాసిన తాజుద్దీన్ స‌య్య‌ద్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సెకండ్ షెడ్యూల్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం `అని తెలిపారు.