తప్పుడు వార్తలు అంటూ కోపగించుకున్న పృథ్వీ


Prudhvi raj
Prudhvi raj

30 ఇయర్స్ పృథ్వీ గా ప్రేక్షకులకు సుపరిచుతుడైన నటుడు పృథ్వీ తాజాగా మీడియా మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు . అసలు నాకు ఆఫర్ రాలేదు అయినా అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్ వచ్చిందని అయితే మెగా కుటుంబం పై ఎన్నికల సందర్బంగా తీవ్ర విమర్శలు చేసాడు కాబట్టి అతడ్ని మన సినిమాలోంచి తీసేసి మరొకరిని పెట్టండి అని అల్లు అర్జున్ చెప్పినట్లుగా ప్రచారం సాగడంతో వార్తలన్నీ అబద్దాలేనని అంటున్నాడు

అంతేకాదు నిజంగానే నాకు సినిమా నుండి ఆఫర్ రాలేదు అలాంటప్పుడు తీసేయడం ఏంటి ? అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు . ఏదైనా తెలుసుకొని రాస్తే మంచిదని హితువు పలుకుతున్నాడు పాపం . పృథ్వీ జగన్ పార్టీ కి మద్దతు ఇవ్వడమే కాకుండా పార్టీ తరుపున పెద్ద ఎత్తున ప్రచారం చేసాడు ,పైగా ప్రచారంలో పవన్ కళ్యాణ్ ని చిరంజీవి ని విమర్శించాడు దాంతో మెగా కాంపౌండ్ నటుడిపై ఆగ్రహంగా ఉందట