PSPK27 ఫ‌స్ట్ లుక్ హంగామా షురూ!

PSPK27 ఫ‌స్ట్ లుక్ హంగామా షురూ!
PSPK27 ఫ‌స్ట్ లుక్ హంగామా షురూ!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత ప్రేక్ష‌కుల ముందు కొస్తున్నారు. రాజ‌కీయాల కార‌ణంగా సినిమాల‌కు కాస్త బ్రేకిచ్చిన ఆయ‌న మ‌ళ్లీ అదే క్రేజ్‌తో సినిమాలు చేస్తున్నారు. రెండున్న‌రేళ్లు కెమెరా ముందుకు రాక‌పోయినా ఆయ‌న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. అదే ఊపు, అదే జోష్‌.. `వ‌కీల్ సాబ్‌` చిత్రాన్ని పూర్తి చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆ వెంట‌నే మ‌రో చిత్రాన్ని స్టార్ట్ చేశారు.

మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు. రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే ప‌వ‌న్ పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని క్రిష్‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ మార్చి 11న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు చిత్ర బృందం తాజాగా ప్ర‌క‌టించింది. దీంతో హంగామా మొద‌లైంది. ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఇప్ప‌టి నుంచే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెట్టారు. మార్చి 11న మెగా ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్‌లో వుంటుందో ఊహించ‌డం క‌ష్టంగానే వుంది అంటున్నారు మేక‌ర్స్‌. మొఘ‌ల్ సామ్రాజ్య కాలం నాటి కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ చిత్రం సాగ‌నుంద‌ని తెలుస్తోంది.