ప‌వ‌న్‌క‌ల్యాణ్ – క్రిష్ మూవీ టైటిల్ ఇదేనా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ - క్రిష్ మూవీ టైటిల్ ఇదేనా?
ప‌వ‌న్‌క‌ల్యాణ్ – క్రిష్ మూవీ టైటిల్ ఇదేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్ గ‌తంలో పోలిస్తే స్పీడు పెంచారు. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ షాకిస్తున్నారు. `పింక్ ` ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌` చిత్రాన్ని పూర్తి చేసిన ప‌వ‌న్ తాజాగా మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. రానా మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది.

ఇదిలా వుంటే ఈ మూవీకి ముందే క్రిష్ డైరెక్ష‌న్‌లో పాన్ ఇండియా మూవీని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఏ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్న ఈ పిరియాడిక‌ల్ చిత్రాన్ని భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ని ఇటీవ‌ల పూర్తి చేశారు. ప‌వ‌న్ 27వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి గ‌తంలో విరూపాక్ష‌, బందిపోటు, గ‌జ‌దొంగ‌, ఓం శివ‌మ్ వంటి పేర్లు వినిపించాయి.

అయితే తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పేరు వినిపిస్తోంది. ఫైన‌ల్‌గా ఈ చిత్రానికి `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` అనే టైటిల్‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ ఖ‌రారు చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్ర‌చారంపై ద‌ర్శ‌కుడు క్రిష్ కానీ, నిర్మాత ఏం.ఎం.ర‌త్నం కానీ స్పందించ లేదు. దీంతో ఇదే టైటిల్‌ని ఫైన‌ల్ చేస్తారా లేక మ‌రో టైటిల్‌కి వెళ‌తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.