మిస్కిన్ మార్క్ మ్యాజిక్ – సైకో ట్రైలర్


మిస్కిన్ మార్క్ మ్యాజిక్ – సైకో ట్రైలర్
మిస్కిన్ మార్క్ మ్యాజిక్ – సైకో ట్రైలర్

కథ రాయడానికి, సినిమా తీయ్యడానికి రెండు పద్దతులు ఉంటాయి. ఒకటి స్క్రిప్ట్ రాసుకొని, స్క్రిప్ట్ కి సమాంతరంగా ఉన్న సినిమాలు అన్నీ చూసేసి, షాట్ ప్లానింగ్ చేసుకోవడం; 2. స్క్రిప్ట్ రాసుకుని, సినిమా తీసేసి.. ఆ సినిమాను దర్శకులుగా మారాలనుకునే 100 మందికి ఇన్స్పిరేషన్ కలుగేలా తనదైన మార్క్ ని చూపించడం. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసే పెద్ద డైరెక్టర్ లు ఎంతో మంది మొదటి కోవకు చెందుతారు. కానీ, అతి కొద్దిమంది రెండో వర్గానికి చెందుతారు. అలాంటివారిలో ఒకడే తమిళ్ డైరెక్టర్ మిస్కిన్. కొత్త జనరేషన్ వాళ్ళకి ఆయన సినిమా చూడటం అంటే ఒక కోర్సు నేర్చుకున్నట్లే ఉంటుంది. షాట్ ప్లానింగ్, కంపోజింగ్, లైటింగ్, ముఖ్యంగా సింగల్ లైన్ డైలాగ్స్, ఫ్లోర్ మూమెంట్ షాట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ క్రాఫ్ట్ లో తనదైన సంతకం చేస్తారు డైరెక్టర్ మిస్కిన్. అంతేకాకుండా ఆయన మంచి డైలాగ్ రైటర్. నటుడు. తాను తీసిన “నందలాలా” అనే సినిమాలో మానసిక వికలాంగుడిగా ఆయన నటన అద్భుతం. ఇక రీసెంట్ గా వచ్చిన విజయ్ సేతుపతి సూపర్ డీలక్స్ సినిమాలో మిస్కిన్ డైలాగ్స్ అయితే అల్టిమేట్ గా ఉంటాయి.

ఇప్పుడు మిస్కిన్ సార్ మళ్ళీ సైకో అనే పేరుతో తన కొత్త సినిమాను రెడీ చేసారు. రిలీజ్ అయిన సైకో ట్రైలర్ చూసిన ప్రేక్షకులు స్టన్ అయిపోతే, మిస్కిన్ సార్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి కూడా గురూ గారు ఇచ్చిన పజిల్స్ ఆధారంగా స్టోరీ ఊహిస్తూ ఇలా ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీత శిఖరం ఇళయరాజా గారు ఇచ్చిన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పడానికి మాటలు లేవు. ముఖ్యంగా ట్రైలర్ లో బీతొవెన్ సింఫనీ మ్యూజిక్ ని మలిచిన తీరు అయితే అనిర్వచనీయం. ఇక ఈ సినిమాలో హీరో ఉదయనిది స్టాలిన్ గుడ్డివాడిగా నటిస్తున్నారు. హీరోయిన్ లు అదితి రావ్ హైదరి, నిత్యామీనన్ లది కూడా కీలకమైన పాత్రలే. ఇక కథలో విలన్ అయిన సైకో పాత్ర ను పరిచయం చేసిన తీరు, ముఖ్యంగా షవర్ కింద మొండెం మాత్రమే స్నానం చేస్తున్నట్లు కనిపించే షాట్స్ ని చూస్తే గూస్ బంప్స్ పక్కా. ఇక క్రైమ్ జోనర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా పండగే. టీజర్ లో లాగే ట్రైలర్ లో కూడా కనీసం ఒక్క డైలాగ్ లేదు. మొత్తానికి సినిమా లవర్స్ కి మిస్కిన్ సార్ స్టోరీ గెస్ చెయ్యమని మంచి టాస్క్ ఇచ్చాడు.