చిరు తొలి చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ మృతి!చిరు తొలి చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ మృతి!
చిరు తొలి చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ మృతి!

టాలీవుడ్ సినిమాను కొత్త పుంత‌లు తొక్కించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న మేన‌రిజ‌మ్స్‌, మెరుపు వేగ‌పు డ్యాన్సులు, కొత్త త‌ర‌హా ఫైట్లు.. ఇలా అన్ని విష‌యాల్లోనూ స‌మూల మార్పుల‌ని తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి ఆయ‌న‌ని `పునాదిరాళ్లు` చిత్రంతో ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ తెలుగు తెర‌కు హీరోగా ప‌రిచ‌యం చేశారు. మెగాస్టార్‌ని టాలీవుడ్‌కు అందించిన గుడిపాటి రాజ్‌కుమార్ శనివారం ఉద‌యం మృతి చెందారు.

గుడిపాటి రాజ్‌కుమార్‌కు ద‌ర్శ‌కుడిగా `పునాదిరాళ్లు` తొలి చిత్రం. మొట్ట‌మొద‌టి చిత్రాల‌కు ఆయ‌న ఏకంగా ఐదు నందిపుర‌స్కారాలని సొంతం చేసుకున్నారు. ఆ త‌రువాత ఎన్నో ఉత్త‌మ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకున్నారు. గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ విష‌యం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న‌కు అపోలో ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు కూడా చేయించారు.

గ‌త కొంత కాలంగా ఎలాంటి ఉపాదిలేక పెద్ద కుమారుడ వ‌ద్ద వుంటున్నారు. అయితే ఆయ‌న పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో చ‌నిపోవ‌డంతో ఆయ‌న ప‌రిస్థితి దుర్భ‌రంగా మారింది. భార్య కూడా చ‌నిసోవ‌డంతో చిన్న కుమారుడు ఆయ‌న బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు. అద్దె ఇంట్లో వుంటూ గ‌త కొంత కాలంగా జీవ‌నాన్ని సాగిస్తున్నారాయ‌న‌. ఆయ‌న స్వ‌గ్రామం విజ‌య‌వాడ స‌మీపంలోని ఉయ్యూరు. అంత్య‌క్రియ‌ల్ని ఉయ్యూరులో జ‌రిపించ‌డానికి చిన్న‌కుమారుడు బౌతిక కాయాన్ని ఉయ్యూరు త‌ర‌లిస్తున్నారు.